Homeలైఫ్ స్టైల్Sleeping immediately after eating chicken: చికెన్ తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Sleeping immediately after eating chicken: చికెన్ తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Sleeping immediately after eating chicken: వారం రోజులపాటు ఉదయం, రాత్రి అనే సమయం లేకుండా ఉద్యోగ, వ్యాపార రీత్యా కష్టపడిన వారు వీకెండేస్ లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వీక్ ఎండ్ డే అనగానే ఆదివారం గుర్తుకువస్తుంది. ఈ ఆదివారం నాడు ఉల్లాసంగా ఉండడమే కాకుండా రుచికరమైన తిండితో గడపాలని భావిస్తారు. ఇందులో భాగంగా చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలతో భోజనం చేయాలని అనుకుంటారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ వెజ్ […]

Sleeping immediately after eating chicken: వారం రోజులపాటు ఉదయం, రాత్రి అనే సమయం లేకుండా ఉద్యోగ, వ్యాపార రీత్యా కష్టపడిన వారు వీకెండేస్ లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వీక్ ఎండ్ డే అనగానే ఆదివారం గుర్తుకువస్తుంది. ఈ ఆదివారం నాడు ఉల్లాసంగా ఉండడమే కాకుండా రుచికరమైన తిండితో గడపాలని భావిస్తారు. ఇందులో భాగంగా చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలతో భోజనం చేయాలని అనుకుంటారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ వెజ్ తోనే వంటలు ఉండాలని చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్ లో భాగంగా రాత్రి కూడా నాన్ వెజ్ తిని వెంటనే నిద్రపోతూ ఉంటారు. అయితే చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే మొబైల్ చూసి ఆ తర్వాత వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మరి ఏం చేయాలి?

మాంసాహారకృతుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా చికెన్, మటన్ లో ఉండే ఫ్యాట్ జీర్ణ క్రియలు స్లో చేస్తాయి. సాధారణ ఆహారం రెండు నుంచి మూడు గంటల్లో జీర్ణం అవుతే.. మాంసాహారకృతులు 4 నుంచి 6 గంటల సమయం తీసుకుంటుంది. ఇలాంటి అప్పుడు ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణాశయంలో ఉండాల్సిన యాసిడ్ పైకి రావడం మొదలవుతుంది. ఇది చాతిలో మంట, గొంతులో చేదు, రుచి వంటివి కోల్పోతారు. కొందరిలో గ్యాస్ బ్లోటింగ్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే గ్యాస్ట్రో ఎస్కో ఫిగర్ రిఫ్లెక్స్ డిసీస్ వంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సూచనలు పాటిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి?

రాత్రి సమయంలో మాంసాహారం తింటే వెంటనే నిద్రపోకుండా కనీసం మూడు గంటల గ్యాప్ ఇవ్వాలి. ఉదాహరణకు రాత్రి 11 గంటలకు నిద్ర పోవాలని అనుకుంటే 8 గంటలకే ఆహారం తీసుకోవాలి. మాంసాహారంతో భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకుండా 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడుస్తూ ఉండాలి. ఆహారం తీసుకున్న కాసేపటి తర్వాత వేడి నీళ్లు తాగితే జీర్ణ క్రియకు సహాయపడుతుంది. పుదీనా లేదా అల్లం టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్తి తగ్గుతాయి. అయితే ఒక్కోసారి తిన్న వెంటనే నిద్రపోతే నిద్రపోయి కూడా ప్రభావం పడుతుంది. జీరక్రియలో కడుపు బిజీగా ఉండడంతో సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా నిద్ర భంగం కలిగితే ఉదయం తలనొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

సండే సందర్భంగా నాన్ వెజ్ తినడంలో తప్పులేదు. కానీ ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. ఇందుకోసం చిన్నచిన్న ఆరోగ్య చిట్కాలు పాటించాలి అని నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper