జాతీయంCar Selection : కొత్త కారు లేదా పాత కారు.. ఏది మంచిది?

Car Selection : కొత్త కారు లేదా పాత కారు.. ఏది మంచిది?

Car Selection : వాహన కొనుగోలుదారుల్లో మార్పు వస్తోంది. కొత్త కార్లు కొంటున్నా.. పాత కార్లు అమ్మేందుకు మాత్రం చాలా మంది ఆసక్తి చూపడం లేదు. కొత్త కారు కొన్నా.. పాత కారే సౌకర్యంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలతో పెద్ద కార్లలో తిరగలేకపోతున్నామని పేర్కొంటున్నారు. సిటీలో చిన్నకార్లే బెటర్‌ అంటున్నారు. దూర ప్రాంతాలకు మాత్రమే పెద్దకార్లు ఉపయోగిస్తామని చెబుతున్నారు.

ఎవరి అవసరం వారిది..
నగరంలో వాహనదారులు కొత్తకారు కొంటున్నారంటే పాత కారును ముందే అమ్మకానికి పెడుతుంటారు. మరికొందరు ఎక్సే్ఛంజ్‌లో ఇచ్చేస్తుంటారు. కానీ, ఇప్పుడు వాహన కొనుగోలుదారుల్లో మార్పు వచ్చింది. దీంతో అమ్మడం, ఎక్స్ఛేంజ్‌ కాకుండా మూడో పద్ధతి అవలంబిస్తున్నారు. కొత్తకారు కొన్నా.. పాత కారు ఉండాల్సిందే అనేవారు పెరుగుతున్నారు. గతంలో పాత కారును సెంటిమెంట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకునేవారు. ఇప్పుడేమో పాతకారు అవసరంగా మారింది. దీంతో అమ్మేవారు తగ్గుతున్నారు.

బైక్‌లను భర్తీ చేస్తున్న కార్లు..
తెలంగాణలో 2021–22లో 1.52 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో అత్యధికం కొత్త కార్లే. పాత కార్లు కూడా ఇందులోకి వస్తాయి. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే లక్షకు పైగా వాహనాలు ఏటా రిజిస్టర్‌ అవుతున్నాయి. ద్విచక్రవాహనాలను క్రమంగా కార్లు భర్తీ చేస్తున్నాయి. రహదారులపై సోమవారం నుంచి శుక్రవారం వరకు విపరీతమైన రద్దీ ఉంటోంది. ముచ్చటపడి, లక్షలు పోసి పెద్ద కారు కొనుగోలు చేసినా.. నత్తనడకను తలపించే హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో నడపలేక నరకయాతన పడుతున్నారు.

పార్కింగే పెద్ద సమస్య..
నగరంలో పెద్దకార్లకు పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. వరుస క్రమశిక్షణ పాటించని హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో ఎక్కడ ఎవరొచ్చి తాకిస్తోరనని.. ఎక్కడ గీతలు పడతాయోనని భయపడుతున్నారు. ఇలాంటి అనుభవాలతో తమకు అలవాటైన పాత చిన్నకారులో సిటీలో చక్కర్లు కొడుతున్నారు. రోజువారీ కార్యాలయానికి ఒక్కడినే వెళ్లేందుకు పెద్ద కారు అవసరం లేదని చాలామంది అంటున్నారు. డ్రైవర్‌ ఉంటే సరే.. సొంతంగా డ్రైవ్‌ చేసేవాళ్లు మాత్రం సిటీ లోపలికి కారంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పండగపూట సొంత ఊర్లకు వెళ్లేందుకు, అవుటర్‌పై సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు, శివార్లలో జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు మాత్రం పెద్ద బండిని తీస్తున్నామని చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Maruti Brezza : నెక్సాన్, పంచ్ లకు షాక్..అమ్మకాల్లో దూసుకుపోయిన మారుతి బ్రాండ్

Maruti Brezza : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. జూన్ 2025లో ఈ సెగ్మెంట్‌లో చాలా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయి. ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజా గురించి...

Toyota Glanza : యాక్సిడెంట్ అయినా ఏం కాదు.. రూ.7 లక్షల కన్నా తక్కువ ధరకే టయోటా సేఫ్టీ కారు

Toyota Glanza : టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా కొత్త ప్రెస్టీజ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ స్పెషాలిటీ ఏంటంటే.. సేఫ్టీ ఫీచర్లను గణనీయంగా పెంచింది....

Most Popular

Tata Avinya X

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...
Honor X7e Plus 5G

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....
Mahindra Vision T

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Jio

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...