Harrier EV vs Creta Electric: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రూ.21-22 లక్షల ధర రేంజ్లో ఇప్పుడు అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ధరలో ప్రముఖంగా వినిపించే రెండు ఎలక్ట్రిక్ కార్లు – టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్మార్ట్ (O) లాంగ్ రేంజ్. ధర పరంగా ఇవి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, ఫీచర్లు, పర్ఫామెన్స్, సైజులో చాలా తేడాలు ఉన్నాయి.
టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్ ఎక్కువ ఫంక్షనల్‌గా, స్ట్రాంగ్ గా కనిపించే ఎస్‌యూవీ. ఇందులో ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, పెద్ద 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇంటీరియర్లో లెదరెట్ సీట్లు, 8-వే పవర్ డ్రైవర్ సీటు, 4-వే పవర్ కో-డ్రైవర్ సీటు, డ్రిఫ్ట్ మోడ్, మల్టీ-టెరైన్ డ్రైవ్ మోడ్‌లు, V2L, V2V ఛార్జింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
మరోవైపు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎక్కువ లగ్జరీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇందులో వెనుక సీటు సన్‌షేడ్స్, డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, ఆంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ బోస్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇందులో ఫాబ్రిక్ సీట్లు ఉంటాయి. దీని ఆఫ్‌రోడ్ కెపాసిటీ లిమిటెడ్ గా ఉంటుంది.
Also Read: ‘ది’ వల్ల నా కొంప మునిగింది.. ఆ పేరుతోనే నాశనం : విజయ్ దేవరకొండ…
సేఫ్టీ విషయానికి వస్తే రెండింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్ డిసెంట్ కంట్రోల్, టీపీఎంఎస్, డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, క్రెటా ఎలక్ట్రిక్‌లో ADAS ఫీచర్లు, ఫ్రంట్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్స్ వంటి అదనపు డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లభిస్తాయి.
హారియర్ ఈవీలో 65 kWh బ్యాటరీ ప్యాక్, రియర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, ఇది 235 bhp పవర్, 315 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 538 కి.మీ.గా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్‌లో 51.4 kWh బ్యాటరీ, ఫ్రంట్-వీల్ డ్రైవ్, 169 bhp పవర్ లభిస్తుంది. దీని రేంజ్ 473 కి.మీ. హైవే డ్రైవింగ్ లేదా ఎక్కువ పవర్ కోరుకునే వారికి హారియర్ ఈవీ ఎక్కువ పర్ఫామెన్స్, ఎనర్జీని అందిస్తుంది.
టాటా హారియర్ ఈవీ సైజులో క్రెటా ఎలక్ట్రిక్ కంటే అన్ని విధాలా పెద్దది. ఇది క్రెటా కంటే 267 మి.మీ. పొడవుగా, 132 మి.మీ. వెడల్పుగా, 85 మి.మీ. ఎత్తుగా ఉంటుంది. వీల్‌బేస్ కూడా హారియర్‌కు 2,741 మి.మీ. కాగా, క్రెటాకు 2,610 మి.మీ. మాత్రమే. అంటే, హారియర్ వెనుక సీట్లలో ఎక్కువ స్పేస్ అందిస్తుంది. అంతేకాకుండా, హారియర్ ఈవీలో 502 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, ఈ సెగ్మెంట్లో అతిపెద్ద 67 లీటర్ల ఫ్రంక్ ఉంటుంది. క్రెటాలో 433 లీటర్ల బూట్, కేవలం 22 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద హారియర్ ఈవీ పెద్దది, ఫ్యామిలీకి అనుకూలమైన ఎస్యూవీ. టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్ ధర రూ.21.49 లక్షలు కాగా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్మార్ట్ (O) లాంగ్ రేంజ్ ధర రూ.21.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంటే ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, ఈ రెండు కార్లు అందించే ఎక్స్ పీరియన్స్ మాత్రం పూర్తిగా ఢిఫరెంటుగా ఉంటుంది.