Maruti Brezza : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. జూన్ 2025లో ఈ సెగ్మెంట్‌లో చాలా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయి. ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజా గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఇది మిగిలిన అన్ని కాంపాక్ట్ ఎస్‌యూవీలను వెనక్కి నెట్టి అమ్మకాల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నెలలో కంపెనీ మొత్తం 14,507 యూనిట్లను విక్రయించింది. ఇది జూన్ 2024తో పోలిస్తే దాదాపు 10శాతం వార్షిక వృద్ధిని చూపుతుంది. గత సంవత్సరం ఇదే నెలలో బ్రెజా 13,172 యూనిట్లు అమ్ముడయ్యాయి.
రెండో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. ఇది చాలా కాలంగా ఈ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ పోటీదారుగా ఉంది. అయితే, ఈసారి దాని అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కంపెనీ జూన్ 2025లో మొత్తం 11,602 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 4% తక్కువ. మూడో స్థానంలో టాటాకు చెందిన మరో కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ నిలిచింది. టాటా పంచ్ అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈసారి కంపెనీ 10,446 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 43% తక్కువ. దీనిని బట్టి వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని అర్థం.
Also Read: 10 ఏళ్ల తర్వాత బాహుబలి సినిమాలో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టని ఈ మిస్టేక్ ను ఎవరైనా గమనించారా?
నాల్గవ స్థానంలో మారుతికి చెందిన కొత్త మోడల్ ఫ్రాంక్స్ నిలిచింది. మారుతి ఫ్రాంక్స్ 9,815 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే స్వల్పంగా 1శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ మోడల్ పర్ఫామెన్స్ బట్టి ఇది నెమ్మదిగా కస్టమర్ల అభిమాన కారుగా మారుతోందని చెప్పవచ్చు. ఐదవ స్థానంలో మహీంద్రా కొత్త ఎస్‌యూవీ XUV 3XO నిలిచింది. దీని 7,089 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 17% తగ్గుదల నమోదైనప్పటికీ, మహీంద్రా ఈ మోడల్ కస్టమర్ల మధ్య తన పట్టును నిలుపుకుంది.
ఆరో స్థానంలో హ్యుందాయ్ వెన్యూ నిలిచింది. దీని 6,858 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 31శాతం తగ్గుదల కనిపించింది. ఆ తర్వాత ఏడవ స్థానంలో కియా సోనెట్ నిలిచింది. దీని 6,658 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 32శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు కొరియన్ కంపెనీల ఎస్‌యూవీలు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ కొత్త మోడల్ ఎక్స్‌టర్ నిలిచింది. దీని 5,873 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కూడా 15శాతం తగ్గుదల నమోదైంది.
Also Read: ప్రభాస్ లుక్కే ఇప్పుడు ట్రెండింగ్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ట్రోల్స్!
తొమ్మిది, పదో స్థానాల్లో స్కోడా కైలాక్, టయోటా టైసర్ నిలిచాయి. కైలాక్ 3,196 యూనిట్లు, టైసర్ 2,408 యూనిట్లు అమ్ముడయ్యాయి. టైసర్ అమ్మకాల్లో 24% తగ్గుదల నమోదైంది. ఇది బ్రాండ్‌కు ఆందోళన కలిగించే విషయం. ఈ మొత్తం గణాంకాలను బట్టి, మారుతి బ్రెజా ఈ సెగ్మెంట్‌లో బలంగా పుంజుకుందని అదే సమయంలో కొన్ని పాత పాపులర్ మోడల్స్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్పష్టమవుతుంది.