Toyota Glanza : టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా కొత్త ప్రెస్టీజ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ స్పెషాలిటీ ఏంటంటే.. సేఫ్టీ ఫీచర్లను గణనీయంగా పెంచింది. ఇప్పుడు గ్లాంజా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డుగా లభిస్తాయి. ఇది భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో కస్టమర్ల పెరుగుతున్న అంచనాలకు, మారుతున్న భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చేసిన ఓ కీలక మార్పు. 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ గా ఇవ్వాలనే నిర్ణయం ద్వారా కంపెనీ డ్రైవర్ల సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్య గ్లాంజాను హై కేటగిరీలోని అనేక మోడళ్లతో ఈక్వల్ చేస్తుంది.
Also Read : ఫైరింగ్ పూర్తి అయ్యింది..’ఓజీ’ నుండి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
గ్లాంజాలో సేఫ్టీ అప్‌డేట్‌లతో పాటు టయోటా ప్రెస్టీజ్ ప్యాకేజ్ అనే కొత్త లిమిటెడ్-పీరియడ్ యాక్సెసరీ బండిల్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. జూలై 31 వరకు అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీలో వెహికల్ స్టైలింగ్, లోపల క్యాబిన్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడానికి రూపొందించిన అనేక ఎక్స్ ట్రా కాస్మెటిక్ అంశాలు ఉన్నాయి. ప్యాకేజీలో క్రోమ్-ట్రిమ్ బాడీ సైడ్ మోల్డింగ్, ప్రీమియం డోర్ వైజర్, రియర్ ల్యాంప్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రియర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. ఈ యాక్సెసరీలను కస్టమర్లు డీలర్ వద్ద పొందవచ్చు.
మారుతి సుజుకి బలెనో ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడిన గ్లాంజా భారత మార్కెట్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. దీని ప్రారంభం నుండి ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ఫ్యూయెల్ కెపాసిటీ, కాంపాక్ట్ సైజ్, ఫీచర్లతో నిండిన క్యాబిన్ కారణంగా ఇది వివిధ రకాల ప్రజలను, ముఖ్యంగా పట్టణ ప్రయాణీకులను, మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిని ఆకర్షిస్తూ ఉంది.
Also Read : ప్రభాస్ లుక్కే ఇప్పుడు ట్రెండింగ్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ట్రోల్స్!
యాంత్రికంగా చూస్తే గ్లాంజాలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.2-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది సీఎన్జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. AMT వెర్షన్ మైలేజ్ లీటరుకు 22.94 కిమీ, సీఎన్జీ వేరియంట్ కిలోకు 30.61 కిమీ మైలేజీ ఇస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే టయోటా గ్లాంజాలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, టయోటా ఐ-కనెక్ట్ ద్వారా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, రియర్ ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు ఉంటాయి. అప్‌డేట్ చేసిన గ్లాంజా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.90 లక్షలు. ఇది కంపెనీకి అత్యంత చవకైన కారు కూడా, దీనిపై టయోటా స్టాండర్డ్ మూడేళ్లు లేదా లక్ష కిమీ వారంటీ కూడా లభిస్తుంది. దీనిని 5 సంవత్సరాలు లేదా 220,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు.