Homeబిజినెస్Mahindra New SUV : నెక్సాన్, బ్రెజాకు షాక్.. రూ.8.94లక్షలకే మహీంద్రా నుంచి అదిరిపోయే కొత్త...

Mahindra New SUV : నెక్సాన్, బ్రెజాకు షాక్.. రూ.8.94లక్షలకే మహీంద్రా నుంచి అదిరిపోయే కొత్త SUV

Mahindra New SUV : మహీంద్రా తన పాపులర్ XUV 3XO లైనప్‌ను మరింత బలోపేతం చేయబోతుంది. ఈ క్రమంలోనే కొత్త RevX సిరీస్‌ను కస్టమర్ల కోసం రిలీజ్ చేసింది. ఇది రూ.8.94 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ M, A అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. మోడరన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీలో ఏమేం ఫీచర్లున్నాయో తెలుసుకుందాం. ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ ను అప్‌గ్రేడ్ చేశారు. M, M(O) వేరియంట్‌లలో ఇప్పుడు బ్లాక్ లెదరెట్ సీట్లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి లభిస్తాయి. ఎక్స్‌టీరియర్ విషయానికొస్తే ఈ కారులో ఇప్పుడు ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌ల్యాంప్స్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. వీటితో పాటు, వన్ టచ్ డ్రైవర్ సైడ్ పవర్ విండో, రియర్ ఏసీ వెంట్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎం కూడా ఉంటాయి. కంపెనీ M(O) వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కూడా చేర్చింది.

Also Read: రోడ్డు పక్కన విక్రయించే సిమ్ కార్డు కొనుగోలు చేస్తున్నారా? జాగ్రత్త..

సేఫ్టీ కోసం M వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఐఎస్‌ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ సపోర్ట్ లభిస్తాయి. ఇంజిన్ విషయానికి వస్తే M, M(O) వేరియంట్‌లలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 110 bhp పవర్, 200 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. RevX A వేరియంట్ ఎక్స్‌టీరియర్‌లో డ్యూయల్ టోన్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, RevX బ్యాడ్జ్ వంటి మార్పులు కనిపిస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ టోన్ థీమ్, బ్లాక్ లెదరెట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎం, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో హెడ్‌ల్యాంప్స్ అండ్ వైపర్స్, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

Also Read: గుజరాత్ లో బ్రిడ్జీలు.. పేకమేడలు.. ఇది రెండో ప్రమాదం.. డబుల్ ఇంజిన్ సర్కార్ కు మరో అవమానం

అయితే, ఈ వేరియంట్‌లో ADAS, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా వంటి కొన్ని ఫీచర్లు లేకపోవడం గమనించవచ్చు. ఈ వేరియంట్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ T-GDI ఇంజిన్ ఉంది. ఇది 130 bhp పవర్, 230 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఈ కొత్త ఎస్‌యూవీ ధరల విషయానికి వస్తే.. M వేరియంట్ ధర రూ.8,94,000 , M(O) వేరియంట్ ధర రూ.9,44,000, A వేరియంట్ (మాన్యువల్) ధర రూ. 11,79,000, A వేరియంట్ (ఆటోమేటిక్) ధర రూ.12,99,000 ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలే. ఈ ధరల రేంజ్లో కొత్త RevX సిరీస్ టాటా నెక్సాన్ , స్కోడా కుషాక్ , కియా సోనెట్ , హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజా వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular