Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. దసరా కి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , చాలా ఆలస్యంగా విడుదల అవ్వడం తో , ఈ చిత్రంపై హైప్ బాగా తగ్గిపోయింది. పైగా టాక్ కూడా డివైడ్ గా రావడం తో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ ఈ చిత్రం దసరా కి విడుదల అయ్యుంటే కచ్చితంగా సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకునేదని, బంగారం లాంటి అవకాశాన్ని మేకర్స్ నాశనం చేసారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే యంగ్ హీరోనే పూజిత పొన్నాడా రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఈ సినిమాలో ఒక పాత్ర కోసం నన్ను సంప్రదించి ఆడిషన్ చేసారని, 5 రోజుల పాటు నాపై షూటింగ్ కూడా జరిపారని, కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , నా స్థానం లో మరో హీరోయిన్ ని తీసుకున్నారని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి నాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా , నేను నటించిన ఆ ఒక్క సన్నివేశాన్ని వాడుకున్నారని, త్రివిక్రమ్ నన్ను నమ్మించి మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. దీనిపై త్రివిక్రమ్ లేదా ఆదర్శ కుటుంబం టీం రెస్పాన్స్ ఇస్తుందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం చాలా హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. త్రివిక్రమ్ పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పూజిత పొన్నాడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ , పెద్దగా గుర్తింపుని మాత్రం సంపాదించలేకపోయింది. ఒకవేళ ఆదర్శ కుటుంబం ఆమె చేసి ఉండుంటే కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యేది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.