దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రముఖ జర్నలిస్ట్ అరెస్ట్ కావడం కలకలం రేపింది. భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’లో సదురు జర్నలిస్ట్ ఓ కథనం రాశాడు. దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఆ కథనం భారత భద్రతకే పెనుముప్పు అని సమాచారం. అందుకే ఉన్న ఫలంగా రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సదురు జర్నలిస్టును అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
Also Read: కేంద్రం వ్యవసాయ సంస్కరణలు.. ఎవరికీ లాభం?
ప్రముఖ జర్నలిస్టు… రచయిత, విశ్లేషకుడు అయిన రాజీవ్ శర్మను ఢిల్లీలో అరెస్ట్ చేయడం సంచలనమైంది. ద ట్రిబ్యూన్, సాకాల్ టైమ్స్, యూనైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే వార్త సంస్థల్లో రాజీవ్ శర్మ పనిచేశారు. ఇటీవల చైనాకు చెందిన ‘గ్లోబల్ టైమ్స్ లో కూడా ఒక ఆర్టికల్ రాశాడు. రక్షణ కు సంబంధించిన విషయంలో పలు పత్రాలు చేరవేశారనే ఆరోపణలున్నాయి.ఈనెల 14న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 14న అరెస్ట్ చేసి.. 15వ తేదీన శర్మను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. ఆరురోజుల కస్టడీకి కోర్టు ఇచ్చింది. దీంతో రక్షణ పత్రాలకు సంబంధించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
‘రాజీవ్ కిష్కింధ’ పేరుతో జర్నలిస్టు రాజీవ్ శర్మకు ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. శర్మ అరెస్ట్ అయ్యేరోజు తన చానెల్ లో రెండు వీడియోలు అప్ లోడ్ చేశారు. ఒక వీడియోలో దేశంలో మీడియా వాచ్ డాగ్ లా ఉండాలని.. లాప్ డాగ్ లా మారిందని విమర్శిచాడు. మరో వీడియోలో చైనా ఇప్పటికీ అల్లర్లు చేయవచ్చు అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ దేశ జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read: రూ.100 లక్షల కోట్ల అప్పు.. కేంద్రానికి తప్పలేదు!
కాగా రాజీవ్ శర్మ వద్ద రక్షణకు సంబంధించిన పత్రాలు లభించాయని పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోందని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Leading journalist cooperation to china
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com