IAS Batch : ఓ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 1951 నుంచి 2020 వరకు మన దేశంలో యూపీఎస్సీ 11569 ఐఏఎస్ అధికారులను నియమించగా అందులో మహిళల ప్రాతినిధ్యం కేవలం 13% మాత్రమే. అంటే ఇప్పటివరకు 1527 మంది మహిళలు మాత్రమే సివిల్ సర్వెంట్లుగా ఉన్నారు. మనదేశంలో అన్నా రాజం మల్హోత్రా తొలి మహిళ ఐఏఎస్ ఆఫీసర్. 1924లో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఆమె తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులను మద్రాస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1951 లో ఆమె సివిల్ సర్వీసెస్ అధికారిగా నియమితులయ్యారు. తొలి మహిళ మద్రాస్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఆమె పేరు పొందారు. 1951 లో అన్నా రాజం మల్హోత్రా ఐఏఎస్ అధికారి అయిన మహిళ ఐఏఎస్ అధికారులు 1,527 మంది మాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. 1009 మంది ఎంపిక..
ఈసారి మారింది
ఇక 2023 ఐఏఎస్ బ్యాచ్ లో మొత్తం 180 మంది అధికారులు ఉండగా.. 41 శాతం మంది అంటే 74 మంది మహిళ అధికారులు కోటడం విశేషం. శిక్షణలో భాగంగా “అదనపు కార్యదర్శి” ఐఏఎస్ అధికారులు ఏప్రిల్ ఒకటి నుంచి మే 31 వరకు.. దాదాపు 8 వారాలపాటు 46 కేంద్ర మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న విభాగాలలో పనిచేస్తారు. దేశంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొదలైన దగ్గరనుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో మహిళా అధికారులు నియమితులైన దాఖలాలు లేవు. దేశంలోఅత్యంత కఠినమైన సివిల్స్ పరీక్ష రాయడం ఒక ఎత్తు అయితే.. అందులో ఉత్తీర్ణత సాధించి.. సివిల్ సర్వీస్ కు ఎంపిక కావడం.. అంటే ఆషామాషి విషయాలు కావు. అంత కఠినమైన పరీక్ష అయినప్పటికీ 2023 ఐఏఎస్ బ్యాచ్ లో 74 మంది మహిళ అధికారులు ఉండడం మారిన పరిస్థితి బాధపడుతోంది.. మహిళా సాధికారత పెరగడం.. సమాజంలో మార్పు రావడం వల్ల ఇది సాధ్యమైంది.. ఇక కేంద్ర ప్రభుత్వం 2015లో అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనివల్ల రియల్ టైం గవర్నెన్స్ ఎక్స్పోజర్ పెరుగుతుందని కేంద్రం భావించింది.. ఈ కార్యక్రమం ద్వారా అధికారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. కరోనా లాంటి సంక్షేమ పరిస్థితి ఏర్పడినప్పుడు జిల్లా స్థాయిలో నిర్వాహన కోసం పిలిచినప్పుడు ఐఏఎస్ అధికారులలో చాలామంది అద్భుతంగా పనిచేశారు.. అంతేకాదు ఈ కార్యక్రమం 10వ వార్షికోత్సవం ఇటీవల జరిగిన నేపథ్యంలో.. అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రాం సాధించిన విజయాలను కేంద్రం వెల్లడించింది. దీని ద్వారా సమర్ధులైన, ఆత్మవిశ్వాసం కలిగిన సివిల్ సర్వెంట్లను దేశానికి అందించడం సాధ్యమైందని పేర్కొంది.. అయితే 2023 బ్యాచ్లో ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రాల నుంచి సివిల్ సర్వెంట్లు ఉండడం విశేషం. గతంలో ఈ ప్రాంతాల నుంచి తక్కువ మంది ఎంపికయ్యేవారు. ప్రస్తుత బ్యాచ్లో ఉన్న అధికారులలో ఎక్కువమంది వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలు చెందినవారు ఉన్నారు. అధికారుల సగటు వయసు జాబితాన్ని పరిశీలిస్తే 22 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండడం విశేషం.
Also Read : వెనుకబడిన బీహార్ లో.. 40 మందికి ఐఐటీ జేఈఈ ర్యాంకులు..ఇదెలా సాధ్యం?