spot_img
Homeజాతీయ వార్తలుWest Bengal elections 2026 : బెంగాల్లో రసగుల్లా కంటే ఈసారి వీరే ఫేమస్.. మమత...

West Bengal elections 2026 : బెంగాల్లో రసగుల్లా కంటే ఈసారి వీరే ఫేమస్.. మమత నుంచి సువేందు అధికారి వరకు చేతులెత్తి మొక్కారు

West Bengal elections 2026 : బెంగాల్ అంటే .. చాలామందికి గుర్తుకు వచ్చేది రసగుల్లా.. బెంగాల్ రాష్ట్రంలో రసగుల్లా విపరీతమైన ఫేమస్. ఇక్కడ అనేక రకాల రసగుల్లాలు తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే కాదు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. బెంగాల్ వచ్చేవారు కచ్చితంగా రసగుల్లాను టేస్ట్ చేసి వెళ్తారు. బెంగాల్ తర్వాత హౌరా బ్రిడ్జి.. చేపల వంటకాలు ఇక్కడ మరింత ఫేమస్.

బెంగాల్ రాష్ట్రంలో ఈసారి రసగుల్లాల కంటే వీరు ఎక్కువ ఫేమస్ అయ్యారు.. ప్రతిరోజు వార్తల్లో కనిపించారు. దీంతో అంతటి మమతా బెనర్జీ.. బిజెపిలోని సువేందు అధికారి తమ ఈగోను పక్కనపెట్టి.. తమకున్న అధికారులను పట్టించుకోకుండా వీరి చుట్టూ తిరిగారు. చేతులెత్తి మొక్కారు. ఒక రకంగా ప్రతిరోజు వారి నామస్మరణ చేశారు. అలాగని వారేమి బెంగాల్ దుర్గామాత శిష్యులు కాదు. దుర్గామాత ఉపాసకులు అంతకంటే కాదు.

బెంగాల్ రాష్ట్రంలో ఈసారి కొత్త ఓటర్ల డామినేషన్ పెరిగిపోయింది. బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈసారి 88 స్థానాల భవితవ్యాన్ని కొత్త ఓటర్లు నిర్దేశిస్తారని తెలుస్తోంది. గత ఎన్నికలలో అభ్యర్థులు నమోదు చేసిన మెజారిటీ కంటే ఇప్పుడు కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదాహరణకు దీన్ హట ఆ నియోజకవర్గంలో 2021లో విక్టరీ మార్జిన్ 57 అయితే.. 21,600 ఓట్లు నమోదు అయ్యాయి.. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 88 నియోజకవర్గాలలో భవితవ్యాన్ని తేల్చే అవకాశం ఉందంటే మామూలు విషయం కాదు. బెంగాల్ రాష్ట్రంలో 294 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 148 స్థానాలలో గెలిస్తే అధికారం దక్కినట్టే. 294 స్థానాలలో 88 స్థానాలలో గెలుపును కొత్త ఓటర్లు నిర్దేశించే స్థాయిలో ఉన్నారంటే మామూలు విషయం కాదు..

కొత్త ఓటర్లు రికార్డు స్థాయిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఓటు వేసేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటు హక్కు విని చూసుకున్న తర్వాత కొత్త ఓటర్లు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. బెంగాల్ కోసం తాము వచ్చామని.. కొత్త బెంగాల్ నిర్మాణాన్ని చేపట్టేందుకు తమ వంతు కృషి చేశామని అన్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ బిజెపి, అధికార టీఎంసీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని ప్రకటించాయి..

కొత్త ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును అధికార పార్టీకి కాకుండా.. వేరే పార్టీకి అనుకూలంగా వినియోగించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా కొత్త ఓటర్లతో సంభాషించాయి. ఈ సందర్భంగా తాము ఎందుకు ఓటు వేసాము.. ఎందుకు ఓటు హక్కు నమోదు చేసుకున్నాము.. ఎందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము.. అనే విషయాలను కొత్త ఓటర్లు మొహమాటం లేకుండా పంచుకున్నారు. ఈ ప్రకారం ఈసారి బెంగాల్ మార్పు వైపు పయనించినట్టు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper