spot_img
Homeజాతీయ వార్తలుWest Bengal election results 2026 BJP victory : బెంగాల్ మీద బెంగ తీరిపోయింది.....

West Bengal election results 2026 BJP victory : బెంగాల్ మీద బెంగ తీరిపోయింది.. హోటల్ లా మారిపోయిన బీజేపీ కార్యాలయం.. ఇంతకీ ఏం చేస్తున్నారో తెలుసా..

West Bengal election results 2026 BJP victory : ఒకటి కాదు రెండు కాదు.. సంవత్సరాలు దాటిపోతున్నాయి. అధికారం మాత్రం దక్కడం లేదు. అలాగని అధికారానికి చాలా దూరం ఉండిపోతున్నారని కాదు.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాకపోతే ఈసారి బలంగా అనుకున్నారు. ఫలితంగా బెంగాల్ ఈసారి కమలానికి జై కొట్టింది. దీదీపాలనకు రామ్ రామ్ చెప్పింది. దీంతో బెంగాల్ మొత్తం కమల పతాకం రెపరెపలాడుతోంది.

దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మమత బెనర్జీ ఏకంగా బిజెపి అధినాయకత్వానికి సవాల్ విసిరింది. బిజెపి నాయకుల మీద దాడులు కూడా చేయించింది. ఇక హత్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బెంగాల్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే మమత అరాచకాలు మామూలువి కావు.

మమత పరిపాలన విషయంలో బెంగాల్ ప్రజలు కొంతకాలంగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా అల్లుడు చేస్తున్న అరాచకాలు బెంగాల్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో వారు ఈసారి మార్పు కోరుకున్నారు. అనుకున్నట్టుగానే బెంగాల్ ప్రజలు మమత పార్టీని తన్ని తరిమేశారు..

బెంగాల్ ఎన్నికల్లో ఇప్పటివరకు 294 స్థానాలకు గాను, 181 స్థానాలలో ఫలితాలు దాదాపుగా వెళ్లడయ్యాయి. ఇందులో బిజెపి 93 స్థానాలలో లీడ్ కొనసాగిస్తోంది. మమత పార్టీ 82 స్థానాల్లో ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి కోరుకున్న లక్ష్యం నెరవేరడంతో.. ఆ పార్టీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా బిజెపి కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరపడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే కార్యకర్తల సంఖ్యకు అనుగుణంగా బిజెపి కేంద్ర కార్యాలయంలో జిలేబిలు, రసగుల్లాలు తయారు చేస్తున్నారు. జిలేబిలు, రసగుల్లాల తయారీతో బిజెపి కేంద్ర కార్యాలయంలో ఘుమఘుమలు వినిపిస్తున్నాయి. తద్వారా బిజెపి కేంద్ర కార్యాలయం ఒకసారిగా హోటల్ లాగా మారిపోయింది.. గతంలో కేంద్రంలో అధికారంలో వచ్చినప్పుడు.. అనేక రాష్ట్రాలలో అధికారాన్ని దక్కించుకున్నప్పుడు బిజెపి కేంద్ర కార్యాలయంలో సంబరాలు మాత్రమే జరిగాయి. ఈ స్థాయిలో రసగుల్లాలు, జిలేబీలు తయారు చేయలేదు. దీనిని బట్టి బెంగాల్ ఎన్నికలను బిజెపి ఏ స్థాయిలో తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper