spot_img
Homeజాతీయ వార్తలుTamil Nadu election results 2026 : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: దూసుకుపోతున్న విజయ్‌ టీవీకే

Tamil Nadu election results 2026 : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: దూసుకుపోతున్న విజయ్‌ టీవీకే

Tamil Nadu election results 2026 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్‌ మొదలైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతోంది. ఈ కౌంటింగ్‌లో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే, అధికార డీఎంకే పార్టీ ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నటుడు విజయ్‌ స్థాపించిన ’తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అనూహ్యంగా పుంజుకుని, సంప్రదాయ రాజకీయ శక్తివైన ఏఐఏడీఎంకేతో పాటు అధికార డీఎంకేను కూడా వెనక్కి నెట్టడం సంచలనం రేపుతోంది .

ఉత్కంఠగా ఫలితాలు..
ప్రస్తుత కౌంటింగ్‌ సరళిని గమనిస్తుంటే, పోస్టల్‌ బ్యాలెట్ల ఫలితాలు రాజకీయ విశ్లేషకులలో కొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. డీఎంకే తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా, టీవీకే పార్టీ అట్టడుగు స్థాయి నుండి పుంజుకుని రేసులో ముందంజలో నిలిచింది. డీఎంకే 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 62 స్థానాల్లో లీడ్‌లోకి వచ్చింది. ఇక ఏఐఏ డీఎంకే 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది .

ప్రదీప్‌ గుప్తా అంచనాలు నిజమవుతున్నాయా?
ఎన్నికలకు ముందు ప్రదీప్‌ గుప్తా నేతృత్వంలోని ఎగ్జిట్‌ పోల్స్‌ అందించిన అంచనాలు వాస్తవ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో బలమైన రాజకీయ శక్తులుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదుగుదల, రాబోయే ఐదేళ్ల పాలనా గమనాన్ని మార్చవచ్చు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, తమిళనాడు రాజకీయాలు ద్రవిడ పార్టీల ఆధిపత్యం నుంచి నూతన రాజకీయ సమీకరణాల వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు .

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper