మాన్సాస్ ట్రస్ట్ లో చాలా అవినీతి జరిగిందని దీనిపై తెదేపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్ ట్రస్ట లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ ఆక్రమణలు ఎవరు చేశారో విచారణలో బయటపడుతుందన్నారు.