spot_img
Homeక్రీడలుVaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ.. ఈ బుడ్డోడికి కచ్చితంగా మనోళ్లు గుడి కడతారు

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ.. ఈ బుడ్డోడికి కచ్చితంగా మనోళ్లు గుడి కడతారు

భారతీయులు ఎవరినైనా ప్రేమిస్తే గుండెల్లో స్థానం ఇస్తారు. ఆ ప్రేమ పెరిగిపోతే గుడి కూడా కట్టేస్తారు. ఇప్పుడు యువభారత్లో సంచలన ఆటగాడు వైభవ్ సూర్య వంశీ కి అభిమానులు కచ్చితంగా గుడి కడతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు..

ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు రాజస్థాన్ జట్టు తరుపున సెంచరీ చేశాడు వైభవ్ సూర్య వంశీ. కేవలం 14 సంవత్సరాలు దాటని వయసులో అతడు ఆ ఘనత అందుకున్నాడు. ప్రపంచ స్థాయి మేటి బౌలర్లను ఓడించి సత్తా చూపించాడు. తద్వారా తను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో నిరూపించాడు.

అండర్ 19 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 175 పరుగులు చేశాడు వైభవ్ సూర్య వంశీ. ఈ మ్యాచ్లో ఆరోన్ జార్జ్ (9) వికెట్ త్వరగానే కోల్పోయినప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత అతడు తన అసలు సిసలైన ఆటను ప్రదర్శించాడు. తద్వారా భారత జట్టు స్కోరును రాకెట్ వేగానికి మించి దూసుకు వెళ్లే విధంగా చేశాడు. ఒక్కో ఓవర్ లో 12 పరుగులకు మించి రన్ రేట్ ఉండేలా చూసుకున్నాడు. తద్వారా భారత్ ఏకంగా 411 పరుగులు చేసింది.

ఫైనల్ మ్యాచ్లో 300 కు మించి పరుగుల లక్ష్యం ఉంటేనే టీమ్ ఇండియా గెలుస్తుందని వైభవ్ సూర్య వంశీ కి తెలుసు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అంతటి లక్ష్యాన్ని ఎలా ఫినిష్ చేసింది కూడా అతడికి తెలుసు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టు ఎదుట అంతకు మించిన భారీ లక్ష్యం ఉండాలని వైభవ్ సూర్య వంశీ భావించాడు. దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 175 పరుగులు చేశాడు.

ఫైనల్ మ్యాచ్లో ఒకానొక దశలో 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్య వంశీ.. జేమ్స్ మింటూ వేసిన ఓవర్లో 18 పరుగులు సాధించాడు. ఇక అప్పటినుంచి అతడు వెను తిరిగి చూసుకోలేదు. కేవలం 32 బంతుల్లోనే తన నాలుగవ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు. ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. చూస్తుండగానే తన వ్యక్తిగత స్కోరును 96 పరుగుల వద్దకు చేర్చుకున్నాడు. జస్ట్ 20 ఓవర్ ముగిసే వరకే సెంచరీ సాధించాడు సూర్యవంశీ. 12 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మైదానంలో సూర్యవంశం మాయాజాలం సృష్టించాడు. చూస్తుండగానే 150 పరుగులు చేశాడు. అంతే వేగంగా తన వ్యక్తిగత స్కోర్ 175 వద్దకు చేర్చుకున్నాడు. అనుకోకుండా అవుట్ కావడంతో అతడి ప్రస్థానం ముగిసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper