Jayavahini death : ప్రముఖ సినీ /సీరియల్ నటి జయవాహిని(పద్మక్క) నిన్న సాయంత్రం కన్ను మూసిన ఘటన సినీ అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది. గత కొన్నేళ్ల నుండి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, ఆరోగ్యం తీవ్రంగా విషమించడం తో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు. వారం రోజుల క్రితమే ఆమె పరిస్థితి విషమించింది అనేది కుటుంబ సభ్యులకు డాక్టర్లు సమాచారం ఇచ్చారు. ఆమెను కాపాడేందుకు చాలా వరకు డాక్టర్లు ప్రయత్నం చేశారు కానీ కాపాడుకోలేకపోయారు. ఆమె మృతి చెందిన విషయాన్నీ ప్రముఖ నటి కారాటీ కళ్యాణి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించింది. టీవీ సీరియల్స్ లో బాగా పాపులరిటీ ని సంపాదించిన ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు,బహిరాభూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
జయవాహిని మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన మహిళ. 1978 వ సంవత్సరం లో ఆమె జన్మించింది. టీవీ, సినీ రంగాల్లో ఆమె చిన్న చిన్న పాత్రలతోనే కెరీర్ ని ఆరంభించింది. ముఖ్యం గా విలన్ క్యారెక్టర్స్ ద్వారా ఈమె సీరియల్స్ తో ఆడియన్స్ ని విశేషంగా అలరించింది. సీనియర్ నటుడు నరేష్,ఆయన తనయుడు విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు ‘ చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం లో కూడా ఈమె అనేక సూపర్ హిట్ చిత్రాల్లో, సీరియల్స్ లో నటించి అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించింది.
ఆమె ఆర్ధిక పరిస్థితి గురించి నటి కరాటీ కళ్యాణి మాట్లాడుతూ డాక్టర్లు ఆమెకు కీమో ఆపరేషన్ చెయ్యాలని, అందుకోసం నిరంతరం ఆమెకు ICU పర్యవేక్షణ ఉండాలని, అందుకు 25 నుండి 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారని, అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంతటి ఆర్ధిక స్తోమత లేదని చెప్పారని చెప్పుకొచ్చింది కరాటీ కళ్యాణి. సినీ ఆర్టిస్ట్స్ జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటూ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసింది.