gautam gambhir strategy : సూపర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టి20 ఫార్మేట్ లో టీం ఇండియాకు ఇది అత్యంత దారుణమైన ఓటమి. 2024 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియా ఐసీసీ నిర్వహించిన ఏ టోర్నీలో కూడా ఓడిపోలేదు. తొలిసారి అది కూడా స్వదేశంలో ఓటమి ఎదుర్కొంది.
టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ వ్యవహరించిన చెత్త విధానం. గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం వల్ల టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. జట్టుకూర్పు విషయంలో గౌతం గంభీర్ దారుణమైన తీరు కొనసాగించడం వల్ల ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 t20 వరల్డ్ కప్ లో అక్షర్ అదరగొట్టాడు. అక్షర్ ఆ మ్యాచ్లో 47 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 176 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా జట్టుపై అక్షర్ పటేల్ కు సమర్థవంతమైన చరిత్ర ఉంది. కానీ ఆ విషయాన్ని గౌతమ్ గంభీర్ మర్చిపోయాడు. జట్టు మీద దరిద్రాన్ని వాషింగ్టన్ సుందర్ రూపంలో రుద్దాడు. సుందర్ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. సుందర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్య పూరితమైన షాట్ ఆడి.. మూల్యం చెల్లించుకున్నాడు.
వాస్తవానికి అక్షర్ దక్షిణాఫ్రికా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అతడికి ఆ జట్టు బౌలర్ల మీద మెరుగైన రికార్డు ఉంది. బంతితోపాటు.. బ్యాట్ తో కూడా అతడు అదరగొడతాడు. కానీ, అక్షర్ ను పక్కనపెట్టి.. వాషింగ్టన్ సుందర్ పెద్ద పొడుస్తాడని గౌతమ్ గంభీర్ జట్టులో చోటు కల్పించాడు. అతడేమో బంతితో విఫలమయ్యాడు.. చివరికి బ్యాట్ తో ఆకట్టుకోలేకపోయాడు.
అక్షర్ పటేల్ ను రిజర్వ్ బెంచ్ కు ఎందుకు పరిమితం చేశాడనే ప్రశ్నకు గౌతమ్ గంభీర్ వద్ద ఇంతవరకు సమాధానం లేదు. వాస్తవానికి అహ్మదాబాద్ లాంటి క్రిటికల్ పిచ్ మీద ఆడుతున్నప్పుడు జట్టు కూర్పు విషయంలో జాగ్రత్త పాటించాలి. కాని వీటిని గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు. పైగా ఇష్టానుసారంగా వ్యవహరించాడు. అందువల్ల టీమ్ ఇండియా ఇంతటి దారుణమైన ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది.