Homeఆధ్యాత్మికంToday horoscope in telugu .24.2.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు రాజయోగం.....

Today horoscope in telugu .24.2.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు రాజయోగం.. పట్టిందల్లా బంగారమే..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఐదు రాశుల వారికి ఈ రోజు రాజయోగం పట్టనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి భవిష్యత్తును ఆలోచింపచేస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు అధిక లాభాలు పొందుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లడమే మంచిది. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు చాలా రంగాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు.. దీంతో అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కోర్టుకు సంబంధించిన కేసులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతారు. తల్లిదండ్రుల అండదండలు ఉండడంతో విద్యార్థులు పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు గతంలో కంటే ఇప్పుడు ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కెరీర్ కు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధువుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి. సోదరులతో కలిసి సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. సొంత వాహనాలపై కాకుండా అద్దె వాహనాలపై వెళ్లడం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని కష్టంగా పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులతో మాట తీరు బాగుండాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. గురువుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీపరీక్షల్లో రాణిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని కేటాయిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ప్రతికూలమైన వాతావరణాలను ఎదుర్కొంటారు. చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కష్టపడి లాభాలను పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో ఓపిక అవసరం. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం ఉండనుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular