spot_img
Homeజాతీయ వార్తలుWest Bengal election results 2026 : బెంగాల్‌లో హోరాహోరీ.. టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌...

West Bengal election results 2026 : బెంగాల్‌లో హోరాహోరీ.. టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌

West Bengal election results 2026 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. ఈసారి ఐదు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌పై అంది దృష్టి ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ జరుగుతోంది. ఇందులో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు జరిగినట్లు ట్రెండ్స్‌ చెబుతున్నాయి. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ మొదట్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీ వెనుకబడ్డారు. సువెంధో అధికారి ఆధిక్యం కనబర్చారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. మమతా బెనర్జీ పుంజుకున్నారు. నందిగ్రామ్‌లో సువోందో అధికారి ఆధ్యిం కనబరుస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీఎంసీపై ఉన్నప్పటికీ మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది.

బీజేపీ స్వల్ప ఆధిక్యం..
పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరుస్తోంది. మొదటి నుంచి ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. 9 గంటల వరకు బీజేపీ 124 సట్లలో ఆధిక్యంలో ఉండగా, అధికార టీఎంసీ 118 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మొత్తం 294 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 150 స్థానాలకుపైగా సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

మమత ఇంటి వద్ద నిశ్శబ్దం..
తాజా ఫలితాల ట్రెండ్స్‌ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఇంటివద్ద సందడి కనిపించడం లేదు. అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇక్కడ దాదాపు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే టీఎంసీ నేతల్లో క్రమంగా ఉత్సాహం ఆవిరవుతోంది.

అస్సోంలో బీజేపీ..
ఇక అస్సాంలో మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇక్కడ హింమత మరోసారి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడీ బీజేపీ 73 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్‌ కేవలం 27 స్థానాలకే పరిమితమైంది.

కేరళలో హోరాహోరీ..
ఇక కేరళలోనూ హోరాహోరీగా పోరు కనిపిస్తోంది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మొదట్లో ఆధిక్యం కనబడింది. కానీ గంట తర్వాత యూడీఎఫ్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 9 గంటలకు యూడీఎఫ్‌ 81 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, ఎల్‌డీఎఫ్‌ 55 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తోంది. ఇక్కడ బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper