Homeజాతీయ వార్తలుSkyroot Aerospace : స్కై రూట్: ఎంతో మంది యువతకు గెలుపుపాఠం

Skyroot Aerospace : స్కై రూట్: ఎంతో మంది యువతకు గెలుపుపాఠం

Skyroot Aerospace : పూర్తి ఇండియన్ టెక్నాలజీతో తయారయింది. పైగా ఆర్బిటాల్ క్లాస్ లో తొలి రాకెట్ ఇది. విక్రమ్ 1 ను విజయవంతంగా ఆకాశంలోకి పంపింది. ఇదంతా చేసింది ఇస్రో కాదు. ఓ ప్రైవేట్ కంపెనీ. ఆ సంస్థ పేరు స్కై రూట్ ఏరోస్పేస్. నింగిలోకి శాటిలైట్స్ ను తీసుకెళ్లడానికి మార్గాలను రూపొందించింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ కంపెనీ వ్యవస్థాపకులుగా ఇస్రోలో మాజీ శాస్త్రవేత్తలుగా పని చేసిన పవన్ కుమార్ చందన.. నాగ భరత్ కొనసాగుతున్నారు. స్కై రూట్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వల్పకాలంలోనే వేల కోట్ల విలువైన యూనికార్న్ స్థాయికి తమ కంపెనీని తీసుకెళ్లారు. విక్రమ్ 1 ప్రయోగంతో యావత్ ప్రపంచం దృష్టిని మొత్తం తమ వైపు తిప్పుకున్నారు.

ఆది నుంచి కష్టాలే

పవన్ కుమార్ చెందిన హైదరాబాద్ లో జన్మించారు. స్థానికంగానే చదువుకున్నారు. 2007లో ఐఐటి ఖరగ్పూర్ లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదివారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో భాగంగా ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఉద్యోగాన్ని సాధించారు. అయితే పవన్ కుమార్ కు చిన్నప్పటినుంచి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఒక వ్యాపార సంస్థను ఏర్పాటు చేయాలని కలగా ఉండేది.. ఐఐటీలో చేరిన తర్వాత ఆ కంపెనీ స్థాపనకు సంబంధించిన ఆలోచన మరింత స్థిరంగా నిలబడిపోయింది. తన లాంటి ఆలోచన ఉన్న నాగ భరత్ పవన్ కు తోడయ్యాడు.

ఇస్రో సంస్థ పెద్దపెద్ద ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. దానికోసం అవసరమైన భారీ రాకెట్లను తయారు చేస్తూ ఉంటుంది. చిన్న స్థాయిలో.. మధ్యస్థాయిలో ఉపగ్రహాలకు అనుకూలంగా ఉన్న రాకెట్లను ఉత్పత్తి చేయడం చాలా తక్కువ. ఇక్కడే వ్యాపార అవకాశాన్ని పవన్ కుమార్.. నాగ భరత్ గమనించారు. వీరిద్దరూ ఇక్కడే స్కై రూట్ సంస్థను ఏర్పాటు చేశారు. వీరికి ముఖేష్ బన్సల్ మింత్రా వ్యవస్థాపకుడు జత కలిశారు. ఆయన మూలధనాన్ని అందించడంతో స్కై రూట్ సంస్థ ఏర్పాటయింది. దీంతో వారిద్దరూ అప్పటి దాకా వారిద్దరూ ఇస్రోలో చేస్తున్న ఉద్యోగాలను వదిలేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను ఏర్పాటు చేశారు.

2018లో స్కై రూట్ సంస్థ ఏర్పాటయింది. ప్రారంభంలో అనేక కష్టాలు.. అంతులేని ఇబ్బందులు.. ఇవన్నీ ఎదురైన తర్వాత చివరగా విజయాలు సాధించడంతో.. కంపెనీని వేలకోట్ల వ్యవస్థ లాగా మార్చడంతో నాగ భరత్.. పవన్ కుమార్ ఆనందానికి అవధులు లేవు.. నాగభారత్ ఐఐటి మద్రాసులో 2007 నుంచి 2011 మధ్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. ఇక ఇదే సంస్థలో 2011 2012లో మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 2010 టాటా ఎలక్సి సంస్థలో ఇంటర్న్ షిప్ పూర్తి చేశారు. 2012 నుంచి 2015 వరకు త్రివేండ్రంలో ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అవియానిక్స్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత జై లింక్స్ సంస్థలో సీనియర్ ప్రోడక్ట్ అప్లికేషన్ ఇంజనీర్ గా సేవలందించారు. ఇక 2018లో స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థకు కో ఫౌండర్ గా వ్యవహరించడం మొదలుపెట్టారు.

స్కై రూట్ సంస్థకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ 10 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కరోనా.. ఇతర సమస్యల వల్ల మూడు సంవత్సరాలు పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భవిష్యత్తు మీద ఆందోళన ఏర్పడింది. అయినప్పటికీ భరత్.. పవన్ ఏమాత్రం ఆశలను వదిలేసుకోలేదు. పట్టుదలతో ముందుకు వెళ్లారు. ఆ తర్వాత గ్రీన్ కో కంపెనీ వీరి పట్టుదలను గుర్తించింది. అంతేకాదు ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్ స్టోన్ కూడా మీరు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.

ఒక్కో దశలో ఒక్కో పెట్టుబడి రావడంతో పవన్.. భరత్ ముందుకు సాగారు. తీవ్రంగా శ్రమించారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం వీరు చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆ ఇద్దరికి కష్టం ఫలితమే విక్రం 1 విజయం. ఒకప్పుడు పెట్టుబడులు లేక నానా ఇబ్బందులు పడినవారు.. నేడు తమ సంస్థను వేల కోట్ల దాకా తీసుకెళ్లారు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. అందరూ కలగంటారు. కలలను చేసుకున్న వారే విజేతలుగా నిలబడతారంటూ వీరిద్దరూ నిరూపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular