Homeజాతీయ వార్తలుVikram 1 Launch : స్కై రూట్.. ప్రైవేట్ రాకెట్ విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం.....

Vikram 1 Launch : స్కై రూట్.. ప్రైవేట్ రాకెట్ విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే..

Vikram 1 Launch : ఇప్పటివరకు భారత అంతరిక్ష రంగంలోకి ఇస్రో పంపిన శాటిలైట్స్ మాత్రమే వెళ్లేవి. ఇప్పుడు భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ -1 విజయవంతంగా రోదసిలోకి వెళ్లిపోయింది. దీనిని ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించింది. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని పంపించాల్సి ఉండేది. […]

Vikram 1 Launch : ఇప్పటివరకు భారత అంతరిక్ష రంగంలోకి ఇస్రో పంపిన శాటిలైట్స్ మాత్రమే వెళ్లేవి. ఇప్పుడు భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ -1 విజయవంతంగా రోదసిలోకి వెళ్లిపోయింది. దీనిని ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించింది. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని పంపించాల్సి ఉండేది. అయితే సాంకేతిక పరమైన అవరోధాల వల్ల దాదాపు 20 నిమిషాల పాటు ఈ ప్రయోగం ఆగింది. తుది దశ తనిఖీలు విజయవంతంగా పూర్తి అయిన తర్వాత దీనిని విజయవంతంగా నింగిలోకి పంపించారు. రాకెట్ నింగిలోకి వెళ్లిపోయిన తర్వాత స్కై రూట్ ట్విట్టర్ ఎక్స్ లో.. హలో స్పేస్ విక్రమ్ 1 నింగిలోకి ప్రవేశించింది అంటూ ట్వీట్ చేసింది.

అంతరిక్షంలోకి ఈ రాకెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దస్తూరి తో వందేమాతరం అని రాసిన ప్రత్యేక పోస్ట్ కార్డును తీసుకెళ్ళింది.. ఈ ప్రయోగం విజయవంతం కావాలని స్కై రూట్ బృందం సభ్యులు.. ఇస్రో మాజీ చైర్మన్లు.. శాస్త్రవేత్తలు.. భారతీయ వ్యోమగాములు.. ఇతరులు పంపించిన వందలకొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను సైతం ప్రత్యేకమైన పే లోడ్ బాక్స్ లో భద్రపరిచారు.

కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ కూడా ఈ పే లోడ్ లో ప్రయాణించింది. భారత అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి సంబంధించిన మహనీయులను గౌరవించుకోవాలని.. ఇలాంటి పని చేస్తామని స్కై రూట్ సంస్థ ప్రకటించింది. ఈ రాకెట్ లో దాదాపు 350 కిలోల పే లోడ్ ఉంది. ఇది ఇండియన్ స్పేస్ లో ప్రైవేట్ రంగం సత్తా చూపించింది. ఇప్పటికే అనేక రకాల స్టార్టప్ లు స్పేస్ రంగంలోకి వస్తున్నాయి. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ప్రైవేట్ స్పేస్ కంపెనీలలో భారీగా జీతాలు ఉండడంతో వారు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు.

ఇస్రోలో జీతాలు తక్కువ ఉండడం.. ప్రయోజనాలు కూడా తక్కువగా ఉండటంతో శాస్త్రవేత్తలు ప్రైవేట్ రంగాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఇటీవల శాస్త్రవేత్తల రాజీనామా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రవేత్తలు తమ రాజీనామాలపై తొందరపడకూడదని సూచించింది. స్పేస్ రంగంలో విపరీతమైన అవకాశాలు ఉండడంతో ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. శాస్త్రవేత్తలకు అద్భుతమైన జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. అందువల్లే ప్రైవేట్ కంపెనీలు రూపొందించిన రాకెట్లు నింగిని తాకుతున్నాయి. స్కై రూట్ రూపొందించిన విక్రమ్ -1 ద్వారా రాకెట్ లో ఉన్న ప్రొపల్షన్.. స్టేజ్ సపరేషన్.. గైడెన్స్.. నావిగేషన్ కంట్రోల్ వంటి వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. దాని ద్వారా వచ్చిన సంవత్సరంతో భవిష్యత్తు కాలంలో వాణిజ్య ప్రయోగాలను చేస్తారు. దీనిని ఏడంతస్తుల భవనంలో పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంలో రూపొందించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper