WTC Final : కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ కమిన్స్, కామెరున్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, తిరిగి జట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలర్ మ్యాట్ కునేమన్ కు కూడా తుది జట్టులో ప్రకాశం దక్కింది.. బ్రెండన్ డగెట్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు.. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరుగుతుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. టీమిండియాను పడగొట్టి ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో అవకాశం దక్కించుకోవడానికి అద్భుతమైన చేసిందని చెప్పాలి. ఎందుకంటే భారత జట్టుతో స్వదేశంలో జరిగిన ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బలమైన ఇండియాను పడగొట్టి 3-1 వ్యత్యాసంతో సిరీస్ ఓన్ చేసుకుంది.. ఈ అద్భుతమైన విజయం ద్వారా డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాదు ఫైనల్ లో అవకాశం కూడా సొంతం చేసుకుంది. మొత్తంగా 19 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా 13 విజయాలతో అదరగొట్టింది. ఏకంగా 67.54 విన్నింగ్ పర్సంటేజ్ సాధించి.. ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 12 టెస్టులు ఆడిన సౌత్ ఆఫ్రికా ఎనిమిది మ్యాచ్లలో విజయాలు సాధించింది. మొత్తంగా 69.44 విన్నింగ్ పర్సంటేజ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ రెండు జట్లు జూన్ 11 నుంచి 15 వరకు ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ ను లార్డ్స్ వేదికగా ఐసీసీ నిర్వహిస్తుంది.
Also Read : భయం పేరుతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ నాటకం.. దాని వెనుక అసలు నిజం ఇదీ!
క్లారిటీ ఇచ్చిన మేనేజ్మెంట్
డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కు కమిన్స్, స్టార్క్, హెడ్, హేజిల్ వుడ్ ఎంపిక కావడంతో.. వారు ఐపీఎల్ లో ఆడేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇటీవల నెలకొన్న ఉద్రిక్తత వల్ల వారు స్వదేశానికి వెళ్ళిపోయారు. దీంతో వారు తిరిగి భారత్ వచ్చి ఐపిఎల్ ఆడేది అనుమానం గానే ఉంది. భారత్లో ఇన్ని రోజులపాటు ఐపీఎల్ ఆడిన తమ ఆటగాళ్లు భయంతో ఇబ్బంది పడుతున్నారని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ సరికొత్త పల్లవి అందుకుంది. అలా భయపడుతున్న ప్లేయర్లకు తాము సపోర్ట్ చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఆస్ట్రేలియా ప్లేయర్లు భయపడాల్సిన సీన్ ఏమీ ఇండియాలో చోటు చేసుకోలేదు. పైగా ప్లేయర్లకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చింది బీసీసీఐ. వారిని దగ్గరుండి మరి ప్రత్యేకమైన ఫ్లైట్లలో సొంత ప్రదేశాలకు పంపించింది. అక్షన్ లో కూడా భారీగా డబ్బులు చెల్లించింది.. అయినప్పటికీ ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ఇండియా వైపు తప్పు ఉందన్నట్టుగా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఉగ్రవాద దేశంతో ఉద్రిక్తతలు కనుక లేకపోయి ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పటివరకు గ్రూప్ దశ సమరం దాదాపు పూర్తయ్యేది. ఆ తర్వాత అసలు సిసలైన ప్లే ఆఫ్ సమరం ప్రారంభమయ్యేది. అమెరికా జోక్యం వల్ల పరిస్థితి కాస్త సద్దుమణిగిన నేపథ్యంలో.. మిగిలిన మ్యాచ్లను ఐదు వేదికలలో నిర్వహించడానికి బిసిసిఐ ప్లాన్ రూపొందించింది. అంతేకాదు శనివారం నుంచి ఐపీఎల్ మళ్లీ రీ ఓపెన్ అవుతుందని బిసిసిఐ పేర్కొంది.. మొత్తంగా మిగిలిన మ్యాచ్లను అంతే ఉత్సాహంతో నిర్వహిస్తామని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది.. ఒకవేళ ఆస్ట్రేలియా ప్లేయర్లు తిరిగి రాకపోతే.. బిసిసిఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా జట్టు ఇదే
కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మ్యాట్ కునే మన్, లబూషేన్, లయన్, స్టార్క్, స్మిత్, బ్యూ వెబ్ స్టర్.
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్: బ్రెండన్ డగెట్.
Also Read : బుమ్రా తప్పుకున్నాడు.. టీమిండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్లు వారే!