Homeట్రెండింగ్ న్యూస్OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో భాగంగా అమెరికా, ఐరోపా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే భారత్ లో కూడా ఈ నిర్ణయం తీసుకుందా? అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అసలు నిజమేంటేంటే? వన్‌ప్లస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, స్మార్ట్‌ఫోన్ […]

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో భాగంగా అమెరికా, ఐరోపా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే భారత్ లో కూడా ఈ నిర్ణయం తీసుకుందా? అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అసలు నిజమేంటేంటే?

వన్‌ప్లస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, స్మార్ట్‌ఫోన్ మెమొరీ భాగాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వాటి లాభాల మార్జిన్లు తగ్గిపోవడంతో ప్రపంచంలోని కొన్ని దేశాల మార్కెట్ నుంచి ఎగ్జిట్ కానుంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే వన్‌ప్లస్ “నార్డ్” (Nord) సిరీస్ మొబైళ్ల తయారీ ఖర్చులు పెరగడం, అదే సమయంలో ప్రీమియం విభాగంలో యాపిల్, శామ్‌సంగ్ వంటి బ్రాండ్ల నుండి గట్టి పోటీ ఎదురవడంతో సంస్థ ఒత్తిడిలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అమెరికా, ఐరోపాలలో ఈ మార్పులు త్వరలోనే మొదలవుతాయని, భారత్‌లో మాత్రం ఈ ప్రక్రియ గురించి మాత్రం ఇప్పుడే ప్రకటించలేదని తెలుస్తోంది.

వన్‌ప్లస్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించడంతో, వన్‌ప్లస్ ఇండియా సంస్థ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాలన్నీ కేవలం పుకార్లేనని, వీటిలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత మార్కెట్లో తమ వ్యాపారం మరియు స్థానిక కార్యకలాపాలన్నీ యథావిధిగా, చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు మరియు కస్టమర్ సర్వీస్ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని వినియోగదారులకు భరోసా ఇచ్చింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper