Homeక్రీడలుRohit Sharma : రిటైర్మెంట్ అన్నారు కదరా.. ఇదీ రోహిత్ శర్మ విశ్వరూపం..

Rohit Sharma : రిటైర్మెంట్ అన్నారు కదరా.. ఇదీ రోహిత్ శర్మ విశ్వరూపం..

Rohit Sharma :చెత్త బంతులను వదిలిపెట్టలేదు. ఇబ్బంది పట్టే బంతులను వెంటాడలేదు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడాన్ని ఆపలేదు. మొత్తంగా క్లాస్.. మాస్.. ఇలా అన్ని కోణాలను చూపించాడు. మొత్తంగా తన రిటైర్మెంట్ మీద రకరకాల వార్తలు.. రకరకాల కథనాలు అటు సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో వినిపిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వాటన్నింటికి తన ఆట ద్వారా సమాధానం చెప్పాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ విధించిన కొండంత పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి […]

Rohit Sharma :చెత్త బంతులను వదిలిపెట్టలేదు. ఇబ్బంది పట్టే బంతులను వెంటాడలేదు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడాన్ని ఆపలేదు. మొత్తంగా క్లాస్.. మాస్.. ఇలా అన్ని కోణాలను చూపించాడు. మొత్తంగా తన రిటైర్మెంట్ మీద రకరకాల వార్తలు.. రకరకాల కథనాలు అటు సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో వినిపిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వాటన్నింటికి తన ఆట ద్వారా సమాధానం చెప్పాడు.

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ విధించిన కొండంత పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ.. ఒకప్పటి మాదిరిగా కాకుండా.. నిదానంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను వదిలిపెట్టలేదు. వెంటాడి వేటాడి పరుగులు తీశాడు. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డమీద ఈ సిరీస్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో విఫలమైన రోహిత్.. రెండో మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు.. మూడో మ్యాచ్లో ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు.

ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో మరో ఓపెనర్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు ఏకంగా 127* పరుగులు చేశాడు. గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 74* పరుగులు చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ మైదానంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ముందుగా బ్యాటింగ్ చేశారు. భీభత్సంగా పరుగులు సాధించారు ఇండియా బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.

రోహిత్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లు మాత్రమే కాకుండా.. తన శైలికి భిన్నంగా సింగిల్స్ కూడా తీశాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అలాగని కేవలం గిల్ మీద మాత్రమే తను భారం వెయ్యలేదు. బరువు తగ్గిన తర్వాత వికెట్ల మధ్య రోహిత్ వేగంగా పరుగులు పెట్టాడు. కొన్ని సందర్భాలలో క్విక్ ట్రిబుల్ రన్స్ కూడా తీశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ గడ్డమీద ఎక్కువసార్లు (15) హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఆప్షన్ ద్వారా రోహిత్ తన కెరియర్లో 66వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. ఈ మ్యాచ్ చివరిది.. వన్డే వరల్డ్ కప్ లో ఆడలేడు.. అతడికి అవకాశం ఇవ్వరు.. ఇలా నెగిటివ్ వార్తలు వస్తున నేపథ్యంలో రోహిత్ తనలో సత్తా తగ్గిపోలేదని.. తాను అనితర సాధ్యమైన ఆటగాడినని నిరూపించుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper