Homeటాప్ స్టోరీస్Telugu Media : తెలుగులో కొత్త మీడియా.. ఆ ఇద్దరు మాజీ ఎడిటర్ల శ్రమ ఫలిస్తుందా..

Telugu Media : తెలుగులో కొత్త మీడియా.. ఆ ఇద్దరు మాజీ ఎడిటర్ల శ్రమ ఫలిస్తుందా..

Telugu Media : ఈ రోజుల్లో మీడియాకు విలువలేదు. ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేసుకుంది. పత్రికా లేదా ఛానల్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్.. నచ్చిన వాళ్ళ మీద పన్నీరు.. నచ్చని వాళ్ళ మీద బురద అన్నట్టుగానే సాగిపోతోంది. ఇలాంటప్పుడు మీడియాకు విశ్వసనీయత ఎందుకుంటుంది. మీడియాను ప్రజలు ఎందుకు నమ్ముతారు.. నేటి కాలంలో మీడియా కంటే కూడా సోషల్ మీడియా మాత్రమే ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దానివల్లే కొత్తలో […]

Telugu Media : ఈ రోజుల్లో మీడియాకు విలువలేదు. ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేసుకుంది. పత్రికా లేదా ఛానల్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్.. నచ్చిన వాళ్ళ మీద పన్నీరు.. నచ్చని వాళ్ళ మీద బురద అన్నట్టుగానే సాగిపోతోంది. ఇలాంటప్పుడు మీడియాకు విశ్వసనీయత ఎందుకుంటుంది. మీడియాను ప్రజలు ఎందుకు నమ్ముతారు.. నేటి కాలంలో మీడియా కంటే కూడా సోషల్ మీడియా మాత్రమే ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దానివల్లే కొత్తలో కొంత నిజాలు తెలుస్తున్నాయి.

మీడియాకు విశ్వసనీయత అనేది కొడిగట్టిన దీపం లాగా మారిపోయిన నేటి రోజుల్లో.. ఇద్దరి మాజీ ఎడిటర్లు ఒక ప్రయోగం చేస్తున్నారు.. కొత్త మీడియా హౌస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే తెర వెనక ప్రయత్నాలు జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే ఈ సంస్థకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరు మాజీ ఎడిటర్లు వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నవారు. పైగా ఇద్దరికీ జర్నలిజంలో చాలా అనుభవమే ఉంది.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వారిద్దరికీ మంచి పేరు ఉంది. పైగా ఇద్దరికీ పత్రికలలో పనిచేసిన అనుభవం
.. సంపాదకులుగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటప్పుడు వారిద్దరు ఏర్పాటు చేయబోతున్న మీడియా హౌస్ పట్ల తెలుగు పాత్రికేయరంగంలో చర్చ నడుస్తోంది.

నేటి కాలంలో ఒక మీడియా హౌస్ ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ కాదు. డబ్బులు కావాలి. రాజకీయ పలుకుబడి కావాలి. దీనికి తోడు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇచ్చే దమ్ము ఉండాలి. ఇప్పుడున్న మీడియా సంస్థల్లో నాలుగు, ఐదుకు మించి సంస్థలు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. కొన్ని సంస్థలు అయితే మీరు తెచ్చుకోండి.. మాకు కొంత ఇవ్వండి అనే విధానంలో బిజినెస్ సాగిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ఇద్దరు మాజీ ఎడిటర్ల మీడియా హౌస్ ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది చూడాలి.

వారిద్దరికీ 60 కి పైగానే వయసు ఉంటుంది. ఒకప్పుడు పత్రికలను నిర్వహించిన ఆ ఇద్దరు మాజీ ఎడిటర్లకు ఆర్థిక స్థిరత్వం చెప్పుకునే స్థాయిలో లేదు. అలాగని వీళ్ళిద్దరిని నమ్మి ఫండింగ్ చేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు వచ్చినట్టు కనిపించడం లేదు. ప్రారంభంలోనే ఇలా ఉంటే.. చివరి వరకు వీరి బండి సక్రమంగా నడుస్తుందా అనేది చూడాలి. అన్నట్టు నేటి కాలంలో న్యూట్రల్ మీడియా అనేది లేదు. ఒకవేళ న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మాజీ ఎడిటర్లు మీడియా హౌస్ ఎలా రన్ చేస్తారు.. వేతనాలు ఎలా ఇస్తారు.. ఒకటి సపోర్ట్ లేకుండా ఎలా మీడియా హౌస్ నిర్వహిస్తారు.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని పాత్రికేయ రంగ కోవిదులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper