Mumbai Floods : ఎండాకాలంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వర్షాలు కురిస్తే మాత్రం ఆ నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ వర్షాకాలంలో సగటు హైదరాబాద్ వాసి కష్టం. వర్షం కురిస్తే చాలు.. హైదరాబాద్ ప్రాంతం మొత్తం నీట మునిగిపోతుంది. రోడ్లన్నీ జలమయం అవుతాయి. మ్యాన్ హోల్ మూతలు ఎక్కడున్నాయో తెలియదు. వాహనం ఎటువైపుకు వెళ్తుందో అర్థం కాదు. రోడ్లమీద ట్రాఫిక్ భారీగా ఏర్పడుతుంది. ఆ సమయంలో అడుగు తీసి అడుగు వేయాలంటేనే నరకం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం బయలుదేరితే ఏ రాత్రికో గాని ఇంటికి చేరే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాలలో వరదనీరు ముంచెత్తినప్పుడు వాహనాలు నీట మునిగిపోతాయి. ఇక అప్పుడు ప్రజల కష్టాలు మామూలుగా ఉండవు.
వర్షాకాలంలో హైదరాబాద్ నగర వాసులు చూసే నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబై విపరీతమైన వర్షాలతో వణికి పోతోంది. గత కొద్దిరోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి గడచిన సంవత్సరాలతో పూర్తి చూస్తే ముంబై నగరంలో అత్యంత భారీ వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభంలో ముంబై నగరంలో విపరీతంగా ఎండలు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా అక్కడ వాతావరణంలో మార్పు వచ్చింది. వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల తాకిడికి ముంబై నగరం ఆగమాగం అయిపోతోంది. ముంబై నగరంలో మధుబన్ ప్రాంతం వరద నీరు వల్ల దాదాపు మునిగిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వరద వల్ల కార్లు నీట మునిగాయి. జనజీవనం దాదాపుగా స్తంభించింది. కానీ ఇక్కడే హైదరాబాద్ నగరం ముంబై తో పోల్చి చూస్తే లక్ష రెట్లు ఉత్తమం అనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరద నీరు రోడ్లమీదకి వస్తుంది. కానీ ఈ స్థాయిలో కాదు. ముంబై నగరానికి హైదరాబాద్ కంటే ఎక్కువ చరిత్ర ఉంది. పైగా ముంబై నగరం హైదరాబాద్ కంటే పెద్దది. మెరుగైన మురికి నీటి పారుదల వ్యవస్థ ఉంది. అయినప్పటికీ వర్షం భారీగా పడితే ముంబై నగరం నీట మునిగిపోతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముంబై నగరంలో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల తో భారతదేశంలోని ముంబై సమీపంలోని వసాయ్‌లోని మధుబన్ ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది.
వర్షాలతో మునిగిన ముంబయిని చూస్తే హైదరాబాద్ లక్ష రేట్లు బెటర్ అనిపిస్తుంది .. ఇక్కడా వరద నీరు నిలిచిపోతుంది కాని మరీ ఈ స్థాయిలో అయితే ఉండదు pic.twitter.com/PWXnfvnFgO
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) July 4, 2026

