Rahul Ramakrishna : జాతి రత్నాలు, హుషారు, అర్జున్ రెడ్డి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) సోషల్ మీడియా లో వివాదాస్పద తరచూ వివాదాస్పద పోస్టులు వేస్తూ ఉంటాడు. దాని వల్ల ఆయన ఎన్నో విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఎందుకు ఇలాంటి తేడా ట్వీట్స్ వేస్తుంటాడో అర్థం కాదంటూ ఆయన్ని అభిమానించే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఆయన KCR , కేటీఆర్ లను ట్యాగ్ చేస్తూ వేసిన ఒక పోస్టు సంచలనాత్మకంగా మారింది. ఆ వేసిన ఈ ట్వీట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, BRS పార్టీ కి అనుకూలంగా ఉంది. ‘మనం ప్రస్తుతం భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. మీరు కం బ్యాక్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘కేసీఆర్ తిరిగొచ్చే సమయం ఆసన్నమైంది’
ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ
హైదరాబాద్ మునిగిపోయిందని, ఇచ్చిన హామీలన్నీ విఫలమయ్యాయని ట్వీట్లో పేర్కొన్న రాహుల్
ఈ పరిస్థితుల నుంచి కాపాడమని ప్రజలు పిలుస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్లని ట్యాగ్ చేసిన నటుడు… pic.twitter.com/I3Jg3dz3Z5
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 2, 2025
అంతే కాకుండా నేను విసిగిపోయా, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను, నన్ను చంపేయండి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన హామాలను నెరవేర్చకుండా దారుణంగా విఫలమైంది. వీటిని సరిదిద్ధేందుకు ప్రజలు మిమల్ని పిలుస్తున్నారు KCR గారు అంటూ మరో పోస్టు చేసాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మరోపక్క రాహుల్ రామకృష్ణ ని BRS పార్టీ అభిమానులు సమర్థిస్తున్నారు. ఈయన వేసిన పోస్టులు ట్విట్టర్ మొత్తం అల్లకల్లోలం అయ్యేలా చేసింది. ప్రభుత్వం మీద ఇంత డైరెక్ట్ గా నెగిటివ్ పోస్టులు పెడుతున్నాడు, రాహుల్ కి మామూలు ధైర్యం లేదంటూ మరికొంతమంది నెటిజెన్స్ ఆయన్ని సమర్థిస్తున్నారు. నీ పని ఎదో నువ్వు చేసుకోకుండా, అవసరమా నీకు ఇలాంటివన్నీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలా పండగ రోజున రాహుల్ రామకృష్ణ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా నిలిచాడు.
రాహుల్ రామకృష్ణ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం వల్లే ఈమధ్య కాలం లో ఆయనకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయని,మేకర్స్ ఇతనితో సినిమాలు తియ్యడానికి భయపడుతున్నారని అంటున్నారు. ఈయన చివరి సారిగా వెండితెర మీద కనిపించి ఏడాది దాటింది. గత ఏడాది ఈయన ‘ఓం భీం బుష్’, ‘మనమే’ వంటి చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఒక్క సినిమా లో కూడా అవకాశం రాకపోవడం గమనార్హం. ఏడాదికి కనీసం 5 నుండి 6 సినిమాలు చేస్తూ వచ్చిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు చేతుల్లో ఒక్క సినిమా కూడా లేకుండా ఉన్నాడంటే కచ్చితంగా ఎదో తేడా జరుగుతుంది అనే అర్థం. దీనిని గమనించి భవిష్యత్తులో అయినా ఆయన సోషల్ మీడియా కి దూరంగా ఉంటాడేమో చూద్దాం.