Homeటాప్ స్టోరీస్KTR controversial remarks : కుర్చీ తాతకు.. కేటీఆర్ పెద్ద తేడా లేదు.. అలా ఉంది...

KTR controversial remarks : కుర్చీ తాతకు.. కేటీఆర్ పెద్ద తేడా లేదు.. అలా ఉంది మరీ భాషా సౌందర్యం..

KTR controversial remarks : ఫ్రస్టేషన్.. కోపం.. అధికారం దక్కలేదని బాధ.. షాడో సీఎం పదవిపోయిందని దుఃఖం.. ఇలా చాలా ఉండవచ్చు కేటీఆర్ లో. కానీ అవేవి ఆయన బయట పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన కాబోయే భావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గులాబీ పార్టీకి కార్యనిర్వాక అధ్యక్షుడు కూడా. తన తండ్రి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యాడు కాబట్టి.. గుంట నక్క హరీష్ రావు (కవిత భాషలోనే సుమ) పార్టీని కాపాడుకోవాలి కాబట్టి.. కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజలకు ముఖ్యంగా రైతులకు అర్థమయ్యేలా వివరించాలి. కానీ తను ఏం చేస్తున్నాడు.. కోపంలో ఏదేదో మాట్లాడుతున్నాడు.. చివరికి రేవంత్ కుర్చీని గుంజి… అని రాయడానికి వీళ్లేని భాషలో మాట్లాడాడు.

ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడాడు. అప్పట్లో కవితను ఉద్దేశించి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏదో మాట అన్నందుకు.. గులాబీ పార్టీ నాయకులు రచ్చ రచ్చ చేశారు. చివరికి బండి సంజయ్ ని తాడు బొంగరం లేని కేసులో అరెస్ట్ చేశారు. అంతేకాదు ఒక ఎంపీ అని కూడా చూడకుండా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి ఇబ్బంది పెట్టారు. ఇంకా చెప్పాలంటే చాలా చేశారు. ఒకరకంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం నడిచింది. ఇక ఆ రోజుల్లో అయితే కేటీఆర్ నోటికి వచ్చిందే పాపం.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కానీ ఇప్పటికి అతని మీద చర్యలు తీసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం వెనుకాడుతోంది. కేటీఆర్ అంటే భయమా.. లేక చర్యలు తీసుకునే స్థాయి రేవంత్ ప్రభుత్వానికి లేదా..

ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అది కూడా కుర్చీని గుంజి అని మాట్లాడుతున్నారంటే ఆ భాషను ఏమనుకోవాలి.. ప్రతిపక్ష నాయకుడిగా కోపం ఉంటే దానిని చేతుల్లో చూపించాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ప్రజలు ఏమాత్రం సహించరు. కేటీఆర్ లాంటి వ్యక్తులు అలా మాట్లాడుతుంటే.. ఇక కింది స్థాయి కార్యకర్తలు ఎలా మాట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడేదో కాంగ్రెస్ నాయకులను.. రేవంత్ రెడ్డిని సుద్ద పూసలు అని చెప్పడం లేదు. భావినాయకులుగా వెలిగే వారు.. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటమే అత్యంత బాధాకరం. అసలు తెలంగాణ సంస్కృతి ఇది కాదు కదా.. తెలంగాణలో ఈ స్థాయిలో బూతులు మాట్లాడటం లేదు కదా.. కేటీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చింది.. కేటీఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు..

కేటీఆర్ మాట్లాడుతుంటే చాలామంది చూస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కేటీఆర్ గురించి ఏమనుకుంటారు.. ఇటీవల ఐటీ ఉద్యోగుల సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి గొప్పగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇలాంటి బి గ్రేడ్ స్థాయి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి.. అలాంటప్పుడు కుర్చీ తాతకు.. కేటీఆర్ కు పెద్ద తేడా ఏముంటుంది.. అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే నానా యాగిచేసే గులాబీ సోషల్ మీడియా.. కేటీఆర్ మాటల గురించి ఏం మాట్లాడుతుంది.. రేపటి నాడు కాంగ్రెస్ నాయకులు గట్టిగా కౌంటర్ ఇస్తే చాలా ఎక్కడ పెట్టుకుంటుంది.. అందుకే నాయకత్వం వహించే నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular