ఐపీఎల్ లో జట్లను కలిగి ఉన్న యాజమాన్యాలకు.. సమర్థవంతమైన ప్లేయర్లను తీసుకోవడం మాత్రమే కాదు.. గట్టి లాబీయింగ్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఆ జట్టు బలంగా ఉంటుంది. బలమైన పోటీ ఇస్తుంది. అవసరమైతే అనితర సాధ్యమైన విజయాలు సాధించి అదరగొడుతుంది.. గతంలో చెన్నై తన తరపున ప్రాతినిధ్యం వహించే ఫారిన్ ప్లేయర్ల కోసం లాబీయింగ్ చేసింది. వారిని ఇండియాకి రప్పించి.. తమ జట్టు తరఫున ఆడేలా చేసింది. అందువల్లే కదా చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఇప్పటికీ స్పోర్ట్స్ సర్కిల్లో ముఖ్యంగా ఐపీఎల్ గురించి తెలిసినవారు చెన్నై జట్టు గురించి అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఆట గురించి పక్కన పెడితే.. లాబీయింగ్ నిర్వహించడంలో ఆ జట్టు మేనేజ్మెంట్ అద్భుతంగా పనిచేస్తుందని అంటుంటారు. గతంలో తన తరఫున ఆడే ఫారిన్ ప్లేయర్ల కోసం ఆ జట్టు మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు అనితర సాధ్యం. అందువల్లే చెన్నై జట్టు కొన్ని సంవత్సరాల వరకు ఐపీఎల్ మొత్తాన్ని శాసించింది.. ఇప్పుడంటే మేనేజ్మెంట్లో కొంతమంది వ్యక్తులు చేరడం వల్ల సరైన ప్లేయర్లను తీసుకోలేకపోతోంది. అది వేరే కారణం అనుకోండి..
ఐపీఎల్ లో మూడుసార్లు ట్రోఫీలు గెలిచి చెన్నై, ముంబై తర్వాతి స్థానంలో ఉంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ జట్టుకు షారుక్ ఖాన్ యజమానియా వ్యవహరిస్తున్నాడు. ఆర్థికంగా అతడు అత్యంత బలవంతుడు. జట్టుకు ఏం కావాలో వెంటనే సమకూర్చగలడు. ఎటువంటి ఆటగాడినైనా జట్టులోకి తీసుకోగలడు. అవసరమైతే డబ్బును మంచినీరు లాగా ఖర్చు పెట్టగలడు. అయితే అటువంటి షారుఖ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం దారుణంగా ఆడుతోంది. ఈ సీజన్లో ఇంతవరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. కోట్లకు కోట్లు పోసి ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రతిభ చూపుతారనుకున్న ఆటగాళ్లు నిబంధన వల్ల జట్టుకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అటువంటి ఆటగాళ్లలో పతిరణ ఒకడు. ఇతడు శ్రీలంక ఆటగాడు.
కొద్దిరోజులుగా ఇతడికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసి ఇవ్వడం లేదు. దీంతో అతడు షారుక్ ఖాన్ జట్టులో అడుగుపెట్టలేదు. వాస్తవానికి శ్రీలంక క్రికెట్ బోర్డు పెద్దలతో కోల్ కతా యాజమాన్యం గనుక మాట్లాడి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎందుకంటే పతిరణ డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్. యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. చివరికి ఇన్నాళ్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఇతడికి ఎన్ఓసి ఇచ్చింది. దీంతో అతడు షారుక్ ఖాన్ జట్టులో అడుగు పెట్టాడు. వాస్తవానికి ఈరోజు జరిగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా అతడు ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడికి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. వచ్చే మ్యాచ్లో అయినా అతనికి అవకాశం ఇస్తారా.. అతడు సేవలను వినియోగించుకుంటారా.. ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.