Homeఆంధ్రప్రదేశ్‌Jagan vs ABN RK : జగన్ గుట్టు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద.. వైసిపి ఫుల్...

Jagan vs ABN RK : జగన్ గుట్టు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద.. వైసిపి ఫుల్ సైలెన్స్

Jagan vs ABN RK : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి( ABN Andhra Jyothi ) పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. శనివారం వరకు ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ శనివారం రాత్రి వీకెండ్ కామెంట్ అంటూ ఏబీఎన్ లో.. కొత్త పలుకు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పై […]

Jagan vs ABN RK : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి( ABN Andhra Jyothi ) పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. శనివారం వరకు ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ శనివారం రాత్రి వీకెండ్ కామెంట్ అంటూ ఏబీఎన్ లో.. కొత్త పలుకు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పై ఏబీఎన్ రాధాకృష్ణ భయంకరమైన ఆటంబాంబు సిద్ధం చేశారు. అదే విషయాన్ని తన కొత్త పలుకులో చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్విచ్ తన దగ్గర ఉందని.. తన జోలికి వచ్చిన రోజున దాన్ని పేల్చుతానంటూ హెచ్చరికలు పంపారు. వైయస్ కుటుంబంలో పాతికేళ్ల కిందట ఘటన ఒకటి ఉందంటూ బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు దానిని బయట పెడతానని చెప్పుకొచ్చారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

* పాతికేళ్ల కిందట ఘటన..
సరిగ్గా పాతికేళ్ల కిందట వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) కుటుంబంలో ఒక విషాదం చుట్టూ ఇప్పుడు కథ నడుస్తోంది. కానీ అది తనకు తెలుసునని రాధాకృష్ణ చెప్పుకు రావడం విశేషం. ఎందుకంటే వైయస్ కుటుంబంలో జరిగిన పరిణామాలు అన్నింటిని గతంలో ఇదే రాధాకృష్ణ బయటపెట్టారు. అచ్చం అదే మాదిరిగా జరిగింది ఆ కుటుంబంలో. ఇప్పుడు కూడా ఆ కుటుంబంలో ఒక గుట్టు తనకు తెలుసు అని.. దానిని బయట పెడితే మరోలా ఉంటుందని హెచ్చరికలు పంపారు రాధాకృష్ణ. అయితే పాతికేళ్ల కిందట వైయస్ కుటుంబంలో ఏం జరిగింది? దానికి జగన్ ఎలా కారకుడు? అని ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేయడం ప్రారంభించారు.

* జగన్ చుట్టూ చాలా కథలు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) విషయంలో చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనది దూకుడు స్వభావం. పోలీస్ స్టేషన్లోనే ఒక పోలీస్ అధికారి పై దాడి చేశారని అందరూ చెబుతుంటారు. తర్వాత ఫ్యాక్షన్ ఘటనలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పేరు రాయలసీమలో ప్రముఖంగా వినిపించింది. తన చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థులను వణికించారన్న పేరు ఆయనపై ఉంది. కానీ అవి ఆధారాలు లేని గాసిప్స్ గా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడగలరా? అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

* వారంలో అంతా సైలెంట్
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టార్గెట్ అయింది. వైసీపీ నేతలు ఏకంగా హైదరాబాద్ వచ్చి ఏబీఎన్ కార్యాలయం వద్ద ఆందోళనలు జరిపారు. అప్పటినుంచి రాధాకృష్ణ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. కానీ తన వద్ద అసలు గుట్టు ఉందంటూ రాధాకృష్ణ ఒక టీజర్ విడుదల చేశారు. దీంతో వైసీపీ నేతలు తోక ముడిచారు. తాడేపల్లి నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు రావడంతోనే వారు సైలెంట్ అయిపోయారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి అయితే గతవారం వీకెండ్ కామెంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు రాధాకృష్ణ. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. కానీ తాజా వీకెండ్ కామెంట్లో అణు బాంబు లాంటి వార్తను పేల్చారు. తన జోలికి వస్తే బ్లాస్ట్ తప్పదని హెచ్చరికలు పంపారు. అది బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper