Homeఎంటర్టైన్మెంట్Degala Babu: జబర్దస్త్ కమెడియన్ 'డేగల బాబు' సతీమణి ని ఎప్పుడైనా చూసారా ? హీరోయిన్స్...

Degala Babu: జబర్దస్త్ కమెడియన్ ‘డేగల బాబు’ సతీమణి ని ఎప్పుడైనా చూసారా ? హీరోయిన్స్ ని మించిపోయిందిగా!

Degala Babu: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ , క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు డేగల బాబు. ఇతను ఎక్కువగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ వేసే స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటాడు. ఆ స్కిట్స్ లో చూసినప్పుడు ఇతను సాధారణ వ్యక్తి అని అంతా అనుకున్నారు. ఎదో రామ్ ప్రసాద్ , హైపర్ ఆది వంటి వారు నాలుగు డైలాగ్స్ ఇస్తే చెప్పేసి వెళ్లిపోవడమే తప్ప, తనకంటూ ఎలాంటి […]

Degala Babu: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ , క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు డేగల బాబు. ఇతను ఎక్కువగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ వేసే స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటాడు. ఆ స్కిట్స్ లో చూసినప్పుడు ఇతను సాధారణ వ్యక్తి అని అంతా అనుకున్నారు. ఎదో రామ్ ప్రసాద్ , హైపర్ ఆది వంటి వారు నాలుగు డైలాగ్స్ ఇస్తే చెప్పేసి వెళ్లిపోవడమే తప్ప, తనకంటూ ఎలాంటి ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు అనే అందరూ అనుకునేవారు. అయితే ఇతనిలో అద్భుతంగా దర్శకత్వం వహించే టాలెంట్ కూడా ఉందని రీసెంట్ గా విడుదలైన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్ తో తేలింది. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న సరైన గుర్తింపు ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఇతనికి వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ టాప్ వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో తెలుగు వెర్షన్ నుండి అత్యధిక వ్యూస్ ని రాబట్టిన సిరీస్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే బాబు రీసెంట్ గా తన కాబోయే భార్య , యాంకర్ అమూల్య తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా , అవి బాగా వైరల్ అయ్యాయి. అమూల్య చూసేందుకు సినిమా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని , బాబు చాలా లక్కీ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమూల్య ఇది వరకు ఈటీవీ , జీ తెలుగు వంటి చానెల్స్ లో చిన్న చిన్న షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది.

ఈమెకు కూడా సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరు రిలేషన్ లో ఉంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , అందులో హీరోగా నటించిన వైవా హర్ష ని ఒక బైక్ గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా కోరుతాడు బాబు. అప్పుడు హర్ష కచ్చితంగా నీకు హంటర్ బైక్ ని బహుమతిగా ఇస్తానని మాట ఇస్తాడు. ఎదో మాట వరుసకు అన్నాడని అంతా అనుకున్నారు , కానీ వెబ్ సిరీస్ విడుదలై పెద్ద హిట్ అవ్వడం తో హర్ష స్వయంగా బాబు ని తన ఇంటికి పిలిపించుకొని , హంటర్ బైక్ ని బహుమతిగా ఇస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper