Iran America negotiations : సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్తాన్ ఆతిధ్యం ఇచ్చింది. ఇస్లామాబాద్ లో ఒక హోటల్లో ఈ చర్చలు నిర్వహించింది. ఆ చర్చలు ఎటు కాకుండా పోయాయి. ఆ తర్వాత అనేక రకాల పరిణామాలు జరిగిన తర్వాత అమెరికా.. ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మళ్లీ అది మొదటికి వచ్చింది. ఈరోజు స్విజర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ దాకా తీసుకెళ్తాయి.. ప్రపంచాన్ని ఏ దిశగా ప్రయాణం సాగించేలా చేస్తాయి అనేది చూడాల్సి ఉంది.
పాకిస్తాన్ ప్రస్తావన ఇటీవలి శాంతి ఒప్పందంలో రాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ అధిపతి ఒక మాట కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ ప్రస్తావన రాకపోవడంతో ఆ దేశ నాయకులు నొచ్చుకున్నారు. ఇంత చేస్తే కనీసం మాకు ఆ మాత్రం గుర్తింపు కూడా ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా గుర్తించకపోయిన పర్వాలేదు.. ఇరాన్ గుర్తించకపోయిన పర్వాలేదు.. కనీసం భారత్ అయినా తమ కృష్ణుని గుర్తించాలి కదా అంటూ ఆ దేశ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు స్విజర్లాండ్ వేదికగా ఇరాన్, అమెరికా చర్చలు సాగిస్తున్నాయి. ఇవి ఎక్కడిదాకా వెళ్తాయి.. ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అనే అంశాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్విజర్లాండ్ వేదికగా ఇరాన్, అమెరికా చర్చలు సాగిస్తున్న తీరు పాకిస్తాన్ దేశానికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ దేశాన్ని కాదనుకొని.. అక్కడ జరిగిన చర్చలు సక్రమంగా లేవని.. కనీసం పత్రిక స్వేచ్ఛ కూడా లేదని ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఆరోపించారు. ఖతార్ దేశంలో కూడా ఇలానే ఉందంటూ.. అందువల్లే శాంతి ఒప్పందానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా బయటికి చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.
వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పరువును ఘోరంగా తీసాయి. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్విట్జర్లాండ్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ చర్చలు ముందుగా స్విజర్లాండ్ లో జరిగి ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని.. పాకిస్తాన్ అనవసరంగా వేలు పెట్టిందని.. ఉగ్రవాద దేశం శాంతి చర్చలకు ఆహ్వానం పలకడం ఏంటని చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు శాంతి చర్చలు స్విజర్లాండ్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో గ్యాస్ ట్రబుల్ పెరిగిపోయి ఉంటుందని… అక్కడి పరిపాలకులు చస్తూ ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు..
కాగా, ఈ చర్చల్లో కూడా పాకిస్థాన్, ఖతార్ మీడియేటర్ పాత్రకే పరిమితం కావడం విశేషం. ఇటీవల పాకిస్థాన్ మీద జేడీ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అయినప్పటికీ పాకిస్థాన్ మీడియేటర్ పాత్రను పోషించడం గమనార్హం.
