Homeఅంతర్జాతీయంDonald Trump: బరాక్ ఒబామా కాపురంలో చిచ్చు పెట్టిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: బరాక్ ఒబామా కాపురంలో చిచ్చు పెట్టిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump:  తా చెడ్డ కోతి.. వనమెల్లా చెరిచిందట.. ఇప్పుడు ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నూటికి నూరు శాతం సరిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆ విధంగా ఉంటాయి మరి.

ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అపహరించి తమ దేశానికి తీసుకొచ్చారు. ఆయన మీద ద్రోహి అని ముద్ర వేశారు. సంబంధం లేకపోయినా సరే ఇరాన్ దేశంతో యుద్ధం చేశారు. అక్కడ కనీ విని ఎరగని స్థాయిలో నష్టాన్ని చేకూర్చారు. ప్రాణనష్టానికి.. ఆస్తి నష్టానికి కారకులయ్యారు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.

ఇక్కడ తోనే ట్రంప్ ఆగిపోవడం లేదు. స్వదేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆయన పరిపాలన మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ ట్రంప్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు ట్రంప్ దృష్టి అమెరికాలో ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మీద పడింది. ట్రంప్ నిర్వాకం వల్ల ఒబామా కుటుంబంలో రచ్చ ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఒబామా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం.. తనను క్రియాశీల రాజకీయాలలో కొనసాగాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన వాపోయారు. మరోవైపు ఒబామా భార్య మిషెల్ ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయాలు వద్దని చెబుతున్నారు.. “మనకు రాజకీయాలు వద్దు. ఈ సమయంలో నువ్వు నాకోసం ఎక్కువ సమయం కేటాయించాలని” తన భార్య కోరుతోందని ఒబామా చెబుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ నిర్ణయాల వల్ల ఒబామా సంసారంలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నిరాశకు గురవుతోంది.

అమెరికన్ రాజ్యాంగం ప్రకారం పూర్వ అధ్యక్షులు రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత.. ఒబామా కూడా రాజకీయాలకు చాలావరకు దూరంగా ఉన్నారు. ఆయన పనితీరు మీద పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే ట్రంప్ తీసుకుంటున్న విధానాలు.. ఆయన సాగిస్తున్న నిర్ణయాలు అమెరికా భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థికంగా.. సామాజికంగా.. భద్రతాపరంగా అమెరికా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. అందువల్లే ఒబామా ట్రంప్ పరిపాలన మీద విమర్శలు చేస్తున్నారు. అందువల్లే డెమోక్రటిక్ పార్టీ ఒబామా మీద ఒత్తిడి తీసుకొస్తోంది. అధ్యక్షుడిగా పదవి నుంచి దూరమై 16 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ.. ఒబామా డెమోక్రటిక్ పార్టీకి పనిచేస్తూనే ఉన్నారు. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న వారిలో ఒబామా అరుదైన వారని అమెరికన్ మీడియా కొనియాడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular