Vaibhav Suryavanshi 94 runs : ట్రై సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అంత గొప్పగా లేదు. అతని మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు . అసలే విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. పైగా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తుండడం అతడిని ఇబ్బంది కలిగిస్తోంది. అలాంటి ఆటగాడిని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టారు. ఇష్టానుసారంగా కామెంట్లు చేశారు. అసలే టీనేజ్ కుర్రోడు.. దీనికి తోడు ఆవేశం ఎక్కువ.. తట్టుకోలేకపోయాడు. మైదానంలోనే దాడికి దిగాడు.
అక్కడితోనే దానిని శ్రీలంక ప్లేయర్లు మర్చిపోయారు. కానీ సూర్యవంశీ మర్చిపోలేదు. మర్చిపోయే వ్యక్తి కూడా కాదు. దూకుడు కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్లో సింహ తాండవం చేశాడు. ఏకంగా 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి.. అతడి దూకుడుకు టీమిండియా కేవలం 8.5 ఓవర్ లోనే 132 పరుగులు చేసింది. 94 రన్స్ కొట్టిన అతడు.. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు.
సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా స్కోర్ మందగించింది. ఆర్య 39.. గైక్వాడ్ 40.. కుమార్ 36.. షడ్గే రెండు పరుగులు చేశారు. కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. 67 పరుగులు చేసి ఆదరగొట్టాడు.. చివర్లో అను కూల్ రాయ్ కేవలం 15 బందులోనే 39 పరుగులు చేశాడు. ఫలితంగా టీం ఇండియా స్కోర్ 377 పరుగులకు చేరుకుంది.
అనంతరం టార్గెట్ మొదలుపెట్టిన శ్రీలంక.. 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో శ్రీలంక ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. సదిరా 52, సాహన్ 38, సాహన్ 62, విజయ్ కాంత్ 39 పరుగులు చేయడంతో.. లంక రేసులకు వచ్చింది. ఒక దశలో 254/7 వద్ద నిలిచింది. గెలుపుకు దగ్గరగా వస్తున్న క్రమంలో.. శ్రీలంక జట్టు ఓత్రికి గురైంది. కేవలం 57 పరుగుల వ్యవధిలో మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో టీం ఇండియా విజయం ఖాయమైంది. మొత్తంగా 66 పరుగుల తేడాతో టీమిండి అద్భుతమైన విజయం సాధించి.. ట్రోఫీ అందుకుంది.
ఈ సిరీస్ లో టీమిండియా ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే కెప్టెన్ తిలక్ వర్మ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కింగ్ మేకర్ పాత్ర పోషించాడు. సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే తిలక్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అతడు చేసిన 67 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్ మొత్తానికి వెన్నెముకలాగా నిలిచాయి. అందువల్లే భారత్ ఏకంగా 377 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఈ టోర్నీ టీమ్ ఇండియాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ముఖ్యంగా శ్రీలంకకు మరింత గుర్తుంటుంది. ఇకపై సూర్యవంశీ పేరు కచ్చితంగా వారికి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే అతడు నైట్ మేర్ కాదు.. పగటిపూటనే చుక్కలు చూపించే సింహబలుడు.
CRYING MOMENT FOR SRILANKAN PLAYERS
– Vaibhav Suryavanshi 50 off 11. Fastest List A fifty ever.
Just look at the reaction of Vaibhav Suryavanshi on srilankan player
— lndian Sports Netwrk (@IS_Netwrk29) June 21, 2026
