Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Laddu controversy : 'కలియుగ శ్రీవారితో పెట్టుకున్నాము..చాలా భయమేస్తుంది' అంటూ రోజా కామెంట్స్..లీకైన వీడియో!

Tirumala Laddu controversy : ‘కలియుగ శ్రీవారితో పెట్టుకున్నాము..చాలా భయమేస్తుంది’ అంటూ రోజా కామెంట్స్..లీకైన వీడియో!

Tirumala Laddu controversy : ఏ విషయంలో అయినా రాజకీయాలు చేయొచ్చు కానీ, దేవుడి విషయంలో, ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయం లో మాత్రం రాజకీయం చేయకూడదు అని అందరూ అంటుంటారు. ఆయన విషయం లో నీచమైన క్రీడలు ఆడిన ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదంటూ కొన్ని ఉదాహరణలు చూపుతూ హెచ్చరిస్తుంటారు పెద్దలు. ఇప్పుడు రాజకీయం మొత్తం పవిత్రమైన తిరుమల లడ్డు చుట్టూనే తిరుగుతుంది. 2024 వ సంవత్సరం సీఎం చంద్రబాబు(CM chandrababu Naidu) తన NDA నేతల సమావేశం లో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఇక మరుసటి రోజు నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ అంశాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక అప్పటి నుండి తిరుమలలో పాత పద్ధతుల్లోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యి తో లడ్డూలు తయారు చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు, ఏర్పాటు చేసిన SIT రీసెంట్ గానే 200 పేజీలకు పైగా చివరి ఛార్జి షీట్ ని నెల్లూరు కోర్టులో సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ లో తిరుమల లడ్డు(Tirumala Laddu) విషయం లో కల్తీ జరిగిన విషయం వాస్తవమే, అసలు స్వచ్ఛమైన నెయ్యి ని వాళ్ళు ఉపయోగించలేదు, వివిధ రసాయనాలతో తయారు చేయబడిన నెయ్యిని మాత్రమే వాళ్ళు ఉపయోగించారు. అందులో ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉన్నాయి అంటూ నివేదికలో స్పష్టంగా వివరించింది. అంతే కాకుండా 10 శాతం కంటే తక్కువ జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందని, కానీ అది మా వద్ద ఉన్న పరికరాలతో డిటెక్ట్ చేయలేమని చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని వైసీపీ పార్టీ నేతలు చేసిన రాజకీయాన్ని గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం.
తప్పు జరిగిపోయింది అని క్షమాపణలు అడగడం మానేసి, జంతు కొవ్వు లేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది , పవన్ కళ్యాణ్, చంద్రబాబు హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ జగన్ దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుల వరకు అందరూ మీడియా ముందుకొచ్చి ఒక రేంజ్ లో హడావిడి చేశారు. అయితే రీసెంట్ గానే రోజా, జోగి రమేష్ రహస్యం గా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోజా మాట్లాడుతూ ‘తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తాడో అని అందరిలో భయం ఉంది. పైకి గంభీరంగా మనం మాట్లాడుతున్నాము కానీ లోపల చాలా భయం ఉంది’ అని జోగి రమేష్ తో రోజా అంటుంది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper