Homeఎంటర్టైన్మెంట్Grammy red carpet controversy : గ్రామీ అవార్డుల్లో.. ఈ అమ్మడికి ఒంటిపై బట్టల సోయి...

Grammy red carpet controversy : గ్రామీ అవార్డుల్లో.. ఈ అమ్మడికి ఒంటిపై బట్టల సోయి కూడా లేదు.. 

Grammy red carpet controversy :మనం ఎంత అందంగా ఉన్నా సరే.. దేహాన్ని సంరక్షిస్తూ దుస్తులు ఉండాలి. మనం ధరించే దుస్తులు ఆధారంగానే సమాజంలో గౌరవం లభిస్తుంది. కానీ, కొందరు ఫ్యాషన్ పేరుతో అడ్డగోలుగా దుస్తులు ధరిస్తారు. కనిపించ కూడని అవయవాలను బయటికి ప్రదర్శించేలా చేస్తారు. ఇలా చేయడం వల్ల తమపై అటెన్షన్ పెరుగుతుందని వారు భావిస్తారు. సాధారణంగా ఫ్యాషన్ పేరుతో సినిమా నటులు.. సెలబ్రిటీలు అడ్డగోలుగా దుస్తులు ధరిస్తారు. కొన్ని సందర్భాలలో దారుణమైన స్కిన్ షో […]

Grammy red carpet controversy :మనం ఎంత అందంగా ఉన్నా సరే.. దేహాన్ని సంరక్షిస్తూ దుస్తులు ఉండాలి. మనం ధరించే దుస్తులు ఆధారంగానే సమాజంలో గౌరవం లభిస్తుంది. కానీ, కొందరు ఫ్యాషన్ పేరుతో అడ్డగోలుగా దుస్తులు ధరిస్తారు. కనిపించ కూడని అవయవాలను బయటికి ప్రదర్శించేలా చేస్తారు. ఇలా చేయడం వల్ల తమపై అటెన్షన్ పెరుగుతుందని వారు భావిస్తారు.
సాధారణంగా ఫ్యాషన్ పేరుతో సినిమా నటులు.. సెలబ్రిటీలు అడ్డగోలుగా దుస్తులు ధరిస్తారు. కొన్ని సందర్భాలలో దారుణమైన స్కిన్ షో కూడా చేస్తారు. వాస్తవానికి ఇలాంటి వాటివల్ల ఓ వర్గం ప్రేక్షకుల మద్దతు లభిస్తుందేమో గాని.. మెజారిటీ సమాజం ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తుంది.
ప్రస్తుతం గ్రామీ అవార్డులు జరుగుతున్నాయి. ఈ అవార్డుల కార్యక్రమం ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివిధ దేశాల నుంచి భారీగా సెలబ్రిటీలు వస్తారు. గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యా సెలబ్రిటీలు రకరకాల దుస్తులు ధరించి వస్తారు.. కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలు ధరించిన దుస్తులు జారిపోవడమో.. లేదా చినిగిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈసారి కూడా అటువంటి సంఘటన చోటుచేసుకుంది.
గ్రామీ అవార్డుల వేడుకల్లో అమెరికన్ గాయని చాపల్ రోన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. లాస్ ఏంజెల్స్ నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాపెల్ ధరించిన దుస్తులు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. షీర్ మరూన్ మగ్లర్ గౌన్, బాడీ ఆర్ట్ తో చాపెల్ కనిపించారు. ఆమె వేసుకున్న దుస్తులు అంతర్గత అవయవాలను బహిర్గతం చేసేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈ డ్రెస్ బాగుందని కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో ఇలాంటి డ్రెస్సులు ధరించి ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
“సెలబ్రిటీలు సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. వారు చేసే పనిని సమాజం గొప్పగా చూడాలి. అలా కాకుండా ఇలాంటి చెత్త పనులతో సమాజం తీవ్రంగా ప్రభావితం అవుతుంది అనే విషయం సెలబ్రిటీలు ఎందుకు గుర్తించరు? ఇప్పటికైనా సెలబ్రిటీలు మార్చుకోవాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper