Ram Charan Son Name: మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి. కారణం ఏంటి అంటే గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి కావడం విశేషం… రీసెంట్ గా ఆయన చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేశాడు. 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక మొత్తానికైతే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలు కొత్తగా సక్సెస్ ని సాధించలేకపోయాయి.
కానీ ఎట్టకేలకు ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ఒక భారీ బాక్సాఫీస్ సక్సెస్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు… చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ సైతం సినిమాల విషయంలో చాలా కేర్ గో గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రామ్ చరణ్ కి రీసెంట్ గా ఇద్దరు కవల పిల్లలు పుట్టిన విషయం మనకు తెలిసిందే.
అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం… ఇంతకుముందే రామ్ చరణ్ కి క్లీంకార అనే ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం అతనికి ముగ్గురు పిల్లలు కావడం విశేషం…ఇప్పుడు తన కొడుకుకి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో రామ్ చరణ్ చాలా సందిగ్ధమైన పరిస్థితిలో పడ్డట్టుగా తెలుస్తుంది. చిరంజీవి మాత్రం తన తండ్రి అయిన వెంకట్రావ్ పేరు కలిసేలా తన మనవడి పేరు పెట్టుకోవాలని చూస్తున్నాడు.
రామ్ చరణ్ దానికి ఏమైనా అబ్జెక్షన్ చెప్పే అవకాశాలున్నాయా? లేదంటే చిరంజీవి చెప్పినట్టుగానే రామ్ చరణ్ వాళ్ళ తాత అయిన ‘వెంకట్రావ్’ పేరుని కలుపుతూనే పేరుని పెట్టే ప్రయత్నం చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీకి ఒక వారసుడు రావడం అనేది ప్రతి ఒక్క మెగా అభిమానిని ఆనందపడేలా చేస్తుంది… ఇక తన పేరు ఏం పెడతారు అనే విషయంలో క్లారిటి రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…