Homeఎంటర్టైన్మెంట్Boyapati Ravi Teja : బోయపాటి శ్రీను కి రవితేజ కి మధ్య జరిగిన గొడవేంటి..?...

Boyapati Ravi Teja : బోయపాటి శ్రీను కి రవితేజ కి మధ్య జరిగిన గొడవేంటి..? అందుకే భద్ర తర్వాత వీళ్ళ కాంబోలో మరో మూవీ రాలేదా..?

Boyapati Ravi Teja : మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన రవితేజతో చేసిన భద్ర సినిమా ఆల్ టైం హిట్ గా నిలువడమే కాకుండా ఇప్పటికి బోయపాటి సినిమాలన్నింటిలో భద్ర సినిమాకి ఉండే గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ఈ సినిమా ఇటు బోయపాటికి, అటు రవితేజకు ఇద్దరికి మంచి గుర్తింపు ను […]

Boyapati Ravi Teja : మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన రవితేజతో చేసిన భద్ర సినిమా ఆల్ టైం హిట్ గా నిలువడమే కాకుండా ఇప్పటికి బోయపాటి సినిమాలన్నింటిలో భద్ర సినిమాకి ఉండే గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ఈ సినిమా ఇటు బోయపాటికి, అటు రవితేజకు ఇద్దరికి మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎందుకు రాలేదు అనే డౌట్ అందరిలో మెదులుతుంది. నిజానికి బోయపాటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగాడు. రవితేజను మాత్రం పట్టించుకోలేదు.

ఇక ఇదిలా ఉంటే రవితేజ సైతం బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే భద్ర సినిమా చేసే సమయంలో వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు అయితే వచ్చాయట. యాక్టింగ్ విషయంలో రవితేజ ఒక విధంగా యాక్టింగ్ చేస్తే బోయపాటి మాత్రం సపరేట్ గా ఇదే కావాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నారట.

కొన్ని సందర్భాల్లో రవితేజ కాంప్రమైజ్ అయి బోయపాటి కోసం తను కావాలి అన్నట్టుగా యాక్టింగ్ చేయాల్సి వచ్చిందట. రవితేజ అతని విషయంలో కొంతవరకు అప్సెట్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయం కారణంగానే వీళ్ళిద్దరి మధ్య కాంబోలో మరో సినిమా అయితే రాలేదని వాళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు ఉన్నప్పటికి దానిని స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని కూడా చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా బోయపాటి శ్రీను – రవితేజ కాంబినేషన్లో భద్ర లాంటి ఒమరో మంచి సినిమా వస్తే చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. మరి వాళ్ల అభిమానుల కోరిక మేరకు మరోసారి వీళ్ళ కంబోనీ రిపీట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper