Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu comments : జగన్ ఫెయిల్యూర్ లీడర్.. అంబటి సంచలనం!

Ambati Rambabu comments : జగన్ ఫెయిల్యూర్ లీడర్.. అంబటి సంచలనం!

Ambati Rambabu comments : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు. అయితే ఆయన తెలివితేటలుగా మాట్లాడతారని అంతా భావిస్తారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఒక్కోసారి విమర్శలకు దారితీస్తుంటాయి. సొంత పార్టీని సైతం ఇబ్బందుల్లో పెడుతుంటాయి. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో నవరత్నాలతో పాటు జగన్మోహన్ రెడ్డి పై అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో […]

Ambati Rambabu comments : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు. అయితే ఆయన తెలివితేటలుగా మాట్లాడతారని అంతా భావిస్తారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఒక్కోసారి విమర్శలకు దారితీస్తుంటాయి. సొంత పార్టీని సైతం ఇబ్బందుల్లో పెడుతుంటాయి. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో నవరత్నాలతో పాటు జగన్మోహన్ రెడ్డి పై అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన అరెస్టయ్యారు. అయితే ఆయన అరెస్టును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా మార్చుకొని గట్టి పోరాటమే చేసింది. చివరకు జగన్మోహన్ రెడ్డి అయితే అంబటి రాంబాబును కాపుల టైగర్ గా చిత్రీకరించారు. అదే సమయంలో అంబటి దూకుడు పెంచారు. వరుసగా మీడియాతో మాట్లాడడమే కాదు.. టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూకు కూడా హాజరవుతున్నారు. తాజాగా టీవీ9 ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. రజనీకాంత్ రావు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు షర్ట్ పై ఉండే నవరత్నాలు.. జగన్ ఫోటో గురించి ప్రస్తావించారు.. నవరత్నాలు ఫెయిల్యూర్స్ కదా మళ్ళీ ఎందుకు దానిని హైలెట్ చేస్తున్నారు అని యాంకర్ అడుగగా.. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కదా అంటూ వ్యాఖ్యానించారు అంబటి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

* వీర విధేయ నేత
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు హార్ట్ కోర్ ఫ్యాన్. జగన్ విషయంలో ఎవరైనా విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఓ రేంజ్ లో చేస్తారు అంబటి రాంబాబు. అంబటి తీరుతో ఎన్ని రకాల విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన విషయంలో సానుకూలంగా ఉంటారు. అయితే ఇప్పుడు అంబటి అరెస్టుతో కాపుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అది ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంబటి. కానీ జగన్మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్ అంటూ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంబటి రాంబాబు అప్రూవల్ గా మారిపోయారన్న కామెంట్స్ నెటిజెన్స్ నుంచి వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper