250 crore Property Registration for Daughter : ప్రేమలో పడినప్పుడు కొంతకాలం ఆ ఏకాంతాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా తమ పాత్రలను మలచుకున్నారు. వైవాహిక జీవితాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు. వారిద్దరికీ విపరీతమైన అభిమాన గణం ఉంది. పైగా ఇద్దరు సినిమాలలో నటిస్తే కోట్లలో పారితోషికం లభిస్తుంది. వారిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప తో కలిసి వారిద్దరూ కాలాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాప వయసు రెండు సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆమె భవిష్యత్తు గురించి వారిద్దరు విపరీతంగా కలలు కంటున్నారు. కలలు కనడం మాత్రమే కాదు వాటిని సాకారం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమెను ఏకంగా 250 కోట్లకు అధిపతిని చేశారు. దీంతో ఈ విషయం సినీ పరిశ్రమలో చర్చకి దారి తీసింది.
Also Read: ‘అఖండ 2’ టీజర్ పై సోషల్ మీడియా లో ఫన్నీ ట్రోల్స్..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
తమ రెండు సంవత్సరాల పాప పేరు మీద 250 కోట్ల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసిన ఆ దంపతులు ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్. వీరిద్దరి గురించి బాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరికి పరిచయం కూడా అవసరం లేదు. వీరు తమ ఏకైక కుమార్తె పై 250 కోట్ల విలువైన భవంతిని రిజిస్ట్రేషన్ చేశారు.. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడుతుంటారు. వారి భవిష్యత్తు బాగుండాలని డబ్బులు దాస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నతమైన చదువులు చదివిస్తారు. ఉత్తమమైన కెరియర్ నిర్మిస్తారు. పెళ్లి ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తుంటారు. తమ సంపాదించిన ఆస్తులలో సింహభాగం పిల్లలకే అందిస్తుంటారు. ఇందుకు రణ్ బీర్ కపూర్, అలియా భట్ మినహాయింపు కాదు. అందుకే తమ రెండు సంవత్సరాల కూతురికి ఏకంగా 250 కోట్ల విలువైన భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. నిండా మూడు సంవత్సరాలు కూడా లేని వయసులో ఆమెను కోటీశ్వరురాలిగా మార్చేశారు. తమ ఇంటి మహాలక్ష్మి పేరు మీద అంతటి ఆస్తిని వారు రిజిస్ట్రేషన్ చేశారు.
దేశ ఆర్థిక రాజధానిలో బాంద్రా ప్రాంతంలో ఉన్న భవనాన్ని తమ కూతురి పేరు మీద ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటి బహిరంగ విలువ ప్రకారం ఆ భవంతి విలువ 250 కోట్ల వరకు ఉంటుంది. ఇంతకీ ఆ స్టార్ కపుల్ కుమార్తె పేరు రాహ కపూర్. అన్నట్టు 250 కోట్ల విలువైన ఆస్తికి గార్డియన్ గా రణ్ బీర్ కపూర్ తల్లి, మాజీ నటి నీతూ కపూర్ ను ఉంచారు.. రాహా కపూర్ కు మైనారిటీ తీరేంతవరకు నీతు కపూర్ ఆ ఆస్తికి సంరక్షరాలిగా ఉంటుంది. ఇక ఈ భవనం రణ్ బీర్ కపూర్ కు తన పూర్వీకుల నుంచి వచ్చింది. రాజ్ కపూర్ ఈ భవంతుని ముందుగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషి కపూర్ అందులో చాలా రోజులపాటు ఉన్నారు. ఇప్పుడు ఈ భవంతి రణ్ బీర్ కపూర్ చేతికి వచ్చింది. అయితే ఆ భవంతిని అత్యంత ఆధునికంగా మార్చారు. ఆ తర్వాత దానిని తన కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ఆస్తి విలువ దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. అన్నట్టు ఇటీవల ఆ భవంతిలో కపూర్ ఫ్యామిలీ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది.