Nag Ashwin next film : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానటువంటి రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. పాన్ ఇండియా మొత్తం మన దర్శకులే ఉండి వాళ్ళ పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక మీదట కూడా మన యంగ్ డైరెక్టర్లు వరుస సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ ఇండస్ట్రీ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ముఖ్యంగా కల్కి (Kalki) సినిమాతో నాగ్ అశ్విన్ (Nag Ashwin) తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తో కల్కి 2 సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా కోసం ఆయన కొద్దిరోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో పాటుగా ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలు సైతం స్టార్ హీరోలతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘కల్కి’ పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని నాకు తెలుసు – నాగ అశ్విన్
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి సిద్ధమయ్యారట. 1940 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమాకి సంబంధించిన కథ ఏంటి అనే వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరి ఏది ఏమైనా కూడా కల్కి 2(Kalki 2) సినిమా అతనికి హిట్ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరి ఇక మీదట చేయబోతున్న సినిమాలతో అంతకు మించిన గుర్తింపు సంపాదించుకున్నప్పుడే నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్ గా మారుతాడు లేకపోతే మాత్రం ఆయన కెరియర్ లో ఆయన చాలా వరకు వెనకబడిపోతాడనే చెప్పాలి.
ప్రస్తుతం తనకున్న మార్కెట్ ను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం చుక్కలు చూపిస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోని ఇకమీదట ఆయన సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. ఇండియాలో ఉన్న హీరోలు అతనితో సినిమాలు చేయడానికి పోటీ పడతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…