Alia Bhatt and Ram Charan : ఈమధ్య కాలం లో హీరోలు,హీరోయిన్లు కేవలం నటించడం ఒక్కటే కాకుండా, ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. కొంత మంది అయితే రిస్క్ చేసి నిర్మాతలుగా కూడా కొనసాగుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) కూడా రీసెంట్ గానే నిర్మాతగా మారి ‘జిగ్రా’ అనే చిత్రం చేసింది. కమర్షియల్ గా ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చింది. అయినప్పటికీ ఆమె నిర్మాణ రంగం నుండి వెళ్లిపోలేదు. ఇప్పటికీ నిర్మాతగా ఆమె ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఈసారి ఆమె కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అనే రేంజ్ ప్లానింగ్ తో ఉంది. అందుకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని హీరో గా పెట్టి ఒక సినిమాని నిర్మించాలనే ఆలోచనలో ఉంది అలియా భట్. #RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ లో బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి.
Also Read : ఒకే రోజు పోటాపోటీగా విడుదలయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు ఎవ్వరు హిట్ సాదించారంటే ?
బాలీవుడ్ బడా డైరెక్టర్స్ అందరూ రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చరణ్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇచ్చిన అనుభవం అలాంటిది మరి. బాలీవుడ్ లో చాలా కథలు విన్నాడు కానీ, ఆయనకు ‘కిల్’ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhatt) చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చిందట. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే సినిమా రాలేదట. ఈ చిత్రాన్ని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తో పాటు అలియా భట్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. గతంలో రామ్ చరణ్,అలియా కలిసి #RRR చిత్రం లో కనిపించారు. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా అలియా భట్ నే నటిస్తుందని తెలుస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక ఆయన సందీప్ వంగ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ మూడు పూర్తి అయ్యాకనే ఈ క్రేజీ బాలీవుడ్ చిత్రాన్ని రామ్ చరణ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లోకి ‘జంజీర్’ చిత్రం ద్వారా అడుగుపెట్టాడు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్ లోకి ఈ సినిమా ద్వారానే అడుగుపెట్టబోతున్నాడు, చూడాలి మరి ఈసారైనా కలిసి వస్తుందా లేదా అనేది .
Also Read : సెట్స్‌లో నాగ్ ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూసేవాళ్లం- అలియా