CBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నవంబర్ 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ మొదలుకానుండగా డిసెంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చివరితేదీగా ఉంది.
Also Read: ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
జనవరి నెల 22వ తేదీన ఆన్ లైన్ పరీక్షను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. https://centralbankofindia.co.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా ఆఫీసర్, రిస్క్ మేనేజర్, సెక్యూరిటీ ii, సెక్యూరిటీ i, ఎకనామిస్ట్ , ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ అనలిస్ట్, రిస్క్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవచ్చు.
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్డీ, గ్రాడ్యుయేషన్ , ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభించనుంది.
https://centralbankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఏవైనా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: బీటెక్ అర్హతతో ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Job vacancies in central bank qualifications and full details are here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com