Jobs: మన జాతీయ భాష హిందీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో మన హిందీ కూడా ఒకటి. ఈ భాష ప్రాధాన్యతను పెంచేందుకు కేంద్ర పాఠశాల స్థాయిలో హిందీని తప్పనిసరి చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. మన జాతీయ భాష నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే మన హిందీ నేర్చుకోవడానికి విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్కకు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్‌ఏఐ హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్లుగా పని చేయడానికి భాషా నిపుణల కోసం గ్లోబల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో హిందీతోపాటు ఇంగ్లిష్, చైనీస్, ఫ్రెంచ్, అరబిక్ భాషల నిపుణులను కూడా నియమించుకుంటోంది.
తాత్కాలిక ఉద్యోగాలు..
ఎక్స్‌ఏఐ.. తాత్కాలిక ప్రాతిపదికన ఈ భాషా నిపుణుల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గ నిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటా బేస్‌లు, ఆన్‌లైన్ వనరులను ఇంగ్లిష్ నుంచి ఇతర భాషల్లకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం అని ఎస్స్‌ఏఐ పేర్కొంది.
ఇంటి నుంచే ఉద్యోగం..
ఎక్స్‌ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్‌ఫ్రం హోమ్. ఎంపికై అభ్యర్థులు స్థానిక సమయం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలి. అయితే ఈ ఉద్యోగా కాలపరిమితి కేవలం ఆరు నెలలే. ఎంపికైనవారికి అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుంచి 65 డాలర్లు(రూ.2,900 నుంచి 5,400) వరకు చెల్లిస్తారు.
సంక్లిష్టత తొలగించేందుకు..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌పామ్ ఎక్స్‌ఏఐని 203లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమే మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే వివిధ భాషలకు తమ సేవలు విస్తరిస్తోంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Job from home just teach hindi this is an amazing offer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com