Indian Coast Guard: సముద్ర జలాల పరిరక్షణలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియన్ నేవీతో సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. ఈ సంస్థలో ఉద్యోగం పొందడం చాలా మంది కల. ఇలాంటి జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇండియన్ కోస్ట్‌గార్డ్(ICG) గుడ్ న్యూస్ చెప్పింది. అర్హుల నుంచి అధికారక పోర్టల్ https://joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ గడువు ఫిబ్రవరి 27 వరకే ఉండగా, దానిని మార్చి 3 వరకు పొడిగించింది.
Also Read: మహాకుంభ్ అయిపొయింది ప్రయాగ్ రాజ్ ఖాళీ అయ్యింది
ఖాళీల వివరాలు
ఇండియన్ కోస్ట్‌గార్డ్ వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 260 పోస్టులను భర్తీ చేస్తుంది.
కోస్ట్ గార్డ్ నార్త్–79
వెస్ట్– 66,
నార్త్ ఈస్ట్– 68,
ఈస్ట్–33,
నార్త్ వెస్ట్–12,
అండమాన్ అండ్ నికోబార్ దీవులు– 3 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు..
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబెక్టులు చదివి ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌లో సబ్జెక్టులకు సంబంధించిన మార్కులను కచ్చితంగా తెలియజేయాలి. మార్కులను సరిగా ఎంటర్ చేయకపోతే అభ్యర్థి అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది.
వయోపరిమితి..
నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. అంటే.. 2002 సెప్టెంబర్ 1 నుంచి 2006 ఆగస్టు 31 మధ్య జన్మించిన ఉండాలి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్..
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోస్ట్‌గార్డ్ ఎన్‌రోల్ పర్సనల్ టెస్ట్ (CGEPT) ఉంటుంది. తర్వాత రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇక మూడో దశలో వైద్య పరీక్షలు చేస్తారు. మూడు దశల్లో మెరిట్‌తో పాస్ అయిన వారికే పోస్టింగ్ ఇస్తారు. ఈ మూడు దశల షెడ్యూల్ త్వరలో కోస్ట్‌గార్డ్ ప్రకటించనుంది.
పరీక్ష విధానం..
ఎగ్జామ్ ప్యాట్రన్‌ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో రెండు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్–1 మొత్తం 60 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లిష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు.
అప్లికేషన్ ప్రాసెస్..
ముందుగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధికారిక పోర్టల్ www.joinindiancoastguard.cdac.in ఓపెన్ చేయాలి.
– హోమ్ పేజీలో కేరీర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇందులో ఐసీజీ నావిక్(జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ ఆప్షన్ వస్తుంది. దానిపై లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదువుకోవాలి.
– ఆ తరువాత ‘అప్లయ్ నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
– ఇందులో పేరు, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
– తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ కావాలి. అప్లికేషన్ ఓపెన్ చేసి అన్ని వివరాలు ఎంటర్ చేయాలి.
– అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
జీతభత్యాలు..
ఇండియన్ కోస్ట్‌గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 వేతనం చెల్లిస్తారు.ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి.
Also Read: అధికారంలోకి వచ్చిన నెలలో 20 వేల మందికిపైగా అరెస్ట్.. అమెరికా జైళ్లలో అక్రమ వలసదారులు!