
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సోనియా అసేవెడో అనే మహిళ మరణించిన సంఘటన పోర్చుగల్ లో చోటు చేసుకుంది. పోర్టోలోని పోర్చుగీసు ఇనిస్టిట్యూట్ ఆప్ అంకాలజీలో పిడియాట్రిక్ నర్స్ గా పనిచేస్తున్న అసేవెడో రెండు రోజుల కిందట ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె ఎలాంటి దుష్ప్రభావాలకు గురికాకున్నా అకస్మాత్తుగా మరణించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి అబిలియో మాట్లాడుతూ ‘ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా మరణించింది. దీనికి గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నాను‘ అని తెలిపారు. కాగా పోర్చుగీసులో 538 మంది ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు.