Homeట్రెండింగ్ న్యూస్Covid Vaccine: 217సార్లు కోవిడ్‌ టీకా.. అతని శరీరంలో ఏం జరిగిందో తెలుసా?

Covid Vaccine: 217సార్లు కోవిడ్‌ టీకా.. అతని శరీరంలో ఏం జరిగిందో తెలుసా?

Covid Vaccine: కోవిడ్‌.. ఈ పేరు వింటే ఇప్పటికీ మనకు భయమే. రెండేళ్లు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ ఇది. దీనిబారిన పడి లక్షల మంది ప్రాణాలు వదిలారు. మూడు వేవ్‌లలో వచ్చిన వైరస్‌లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అతలా కుతలమయ్యాయి. చివరకు కోవిడ్‌కు చాలా దేశాలు వ్యాక్సిన్‌ను కనిపెట్టాయి. రష్యా వ్యాక్సిన్‌ మొదట ఆవిష్కరించినా భారత్‌ టీకాలు తర్వాత వచ్చాయి. దీంతో అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవడం మొదలు పెట్టారు.

రెండు మూడుసార్లు..
కోవిడ్‌ టీకాను కరోనా వైరస్‌ నుంచే తయారు చేశారు. దీంతో కరోనా సోకినా దానిని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని, యాంటీబాడీస్‌ను పెంపొందిస్తుంది ఈ వ్యాక్సిన్‌. ఈ టీకాను రెండుసార్లు తీసుకోవాలని మొదట నిర్ణయించారు. తర్వాత బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలని సూచించారు. కానీ, చాలా మంది రెండు డోస్‌లు మాత్రమే తీసుకున్నారు. మూడో డోస్‌ చాలా తక్కువ మంది వేసుకన్నారు. అయితే జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217సార్లు వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు తెలిపాడు. ఈవిషయం తెలిసి వైద్యులు షాక్‌ అయ్యారు. అతడిలో రోగ నిరోధక శక్తిని పరిశీలిచేందుకు, శరీరంలో మార్పులను తెలుసుకునేందుకు వైద్యులు పరిశోధనలు చేశారు. ఇందులో ఫలితాలు చూసి షాక్‌ అయ్యారు.

134 సార్లు మాత్రమే..
జర్మనీకి చెందిన సదరు వ్యక్తి తాను 217సార్లు కోవిడ్‌ టీకా వేసుకున్నట్లు చెప్పినా.. వైద్యులు మాత్రం అతడు 134 సార్లు మాత్రమే టీకా వేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఫెడ్రిక్‌ అలెగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అది కూడా ఎక్కువే. జర్మనీలో మొత్తం 6 కోట్ల మంది కోవిడ్‌ టీకా వేసుకున్నారు. చాలా మంది రెండు మూడుసార్లుకన్నా ఎక్కువసార్లు టీకా వేసుకున్నారు.

ఓవర్‌ డోస్‌పై పరిశోధనలు..
134 సార్లు కోవిడల్‌ టీకా వేసుకున్న వ్యక్తి ఓవర్‌ డోస్‌ తీసుకున్న కారణంగా అతడిలో ఎలాంటి మార్పులు వచ్చాయని ఫెడ్రిక్‌ అలెగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సాధారణంగా టీకాలు ఎక్కువసార్లు తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. టీ కణాలు బలహీనపడతాయి. సాధారణంగా హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ ఉన్నవారు టీకాలు తీసుకుంటారు. శరీరంలో మంటలను కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి ప్రోఇన్‌ప్లమేటరీ కలిగిస్తాయని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అతడిలో శరీరంలో షాకింగ్‌..
అయితే 134 సార్లు కోవిడ్‌ టీకా తీసుకున్న జర్మన్‌ వ్యక్తిలో రోగనిరోధక శక్తి, టీ కణాల పనితీరుపై అలెగ్జాడర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అతడి శరీరంలో జరిగిన మార్పులు చూసి షాక్‌ అయ్యారు. గత పరిశోధనల్లో పేర్కొన్నట్లు అతడి శరీరంలో టీ కణాలు బలహీనపడలేదు. రోగనిరోధకశక్తి తగ్గలేదు. అన్నీ సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్‌ను ఎదుర్కొనే టీకణాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అవికూడా చాలా బాగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో పనిచేసినట్లే అన్నీ పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఫలితాలు చూసి గత పరిశోధనల ఫలితాలపై మరోమారు అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. గత ఫలితాలను విశ్లేషిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular