spot_img
Homeఇంటర్నేషనల్టిక్ టాక్ కు మరో షాక్.. ఆ దేశంలో నిషేధానికి గురైన యాప్..?

టిక్ టాక్ కు మరో షాక్.. ఆ దేశంలో నిషేధానికి గురైన యాప్..?

డ్రాగన్ దేశానికి చెందిన ఫేమస్ యాప్ టిక్ టాక్ కు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్ లో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించడంతో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఆ తరువాత అమెరికాలో కూడా టిక్ టాక్ నిషేధం దిశగా అడుగులు పడ్డాయి. తాజాగా పాకిస్తాన్ సైతం టిక్ టాక్ యాప్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కొందరు టిక్ టాక్ యాప్ లో అభ్యంతర కంటెంట్‌ కనిపిస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులను విచారించగా టిక్ టాక్ యాప్ లో నిజంగానే అభ్యంతర కంటెంట్ దర్శనమిస్తోందని తేలింది. దీంతో పాకిస్తాన్ టెలీకమ్యునికేషన్ అథారిటీ తాత్కాలికంగా యాప్ పై నిషేధం విధించింది. టిక్ టాక్ ప్రతినిధులు ఇచ్చే వివరణను బట్టి నిషేధం విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. గతంలో పాక్ ప్రభుత్వం టిక్ టాక్ కు కంటెంట్ విషయంలో కీలక సూచనలు చేసింది. అయితే ఎన్ని సూచనలు చేసినా టిక్ టాక్ తీరులో మాత్రం మార్పు రాలేదు.

టిక్ టాక్ నుంచి సంతృప్తికర స్పందన రాకపోతే మాత్రం తాత్కాలిక నిషేధం కాస్తా శాశ్వత నిషేధంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టిక్ టాక్ కంటెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నిసార్లు సూచించినా ప్రభుత్వం మాటలను కూడా యాప్ ప్రతినిధులు లెక్క చేయలేదని సమాచారం. భవిష్యత్తులో మరికొని దేశాలు కూడా టిక్ టాక్ యాప్ పై బ్యాన్ విధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మన దేశం టిక్ టాక్ వల్ల జాతి భద్రతకు ప్రమాదం పొంచి ఉందని భావించి ఆ యాప్ పై నిషేధం విధించింది. మరోవైపు చైనా భారర్ తో వ్యవహరించిన తీరు యాప్ పై నిషేధం అమలు కావడానికి కారణమైంది. టిక్‌ టాక్‌, వుయ్‌ చాట్‌లపై అమెరికా సైతం నిషేధం విధిస్తోంది. పలు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
Oktelugu Epaper