Homeజాతీయ వార్తలుWest Bengal elections 2026: పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు.. రెండు విడతలు ఎవరికి లాభం?

West Bengal elections 2026: పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు.. రెండు విడతలు ఎవరికి లాభం?

West Bengal elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పశ్చిమబెంగాల్‌. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా నిలబెట్టుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తృణమూల్‌ను కొట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. 294 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్‌ […]

West Bengal elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పశ్చిమబెంగాల్‌. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా నిలబెట్టుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తృణమూల్‌ను కొట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. 294 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌ జరుగుతుంది. 150 సీట్లు మొదటి దశ, 144 సీట్లకు రెండో దశలో పోలింగ్‌ నిర్వహిస్తారు. 2021లో ఆరు విడతలు జరిగినప్పటికీ, ఈసారి తగ్గింపు భద్రతా కారణాల వల్లనే అని ఎన్నికల సంఘం వివరించింది.

ఈసీపై మమతా ఆరోపణలు..
తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు విడతల పోలింగ్‌తో తమకు నష్టం అని పేర్కొంటోంది. గతంలో ఆరు విడతల్లో ఎన్నికలు జరిగిన సమయంలోనూ ఇలాగే ఈసీని తప్పు పట్టింది. బీజేపీపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు రెండు విడతలనూ తప్పు పడుతున్నారు. ఎక్కువ దశలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని, ఇప్పుడు తగ్గింపు కూడా సవాలుగా మారిందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

చారిత్రక నేపథ్యం..
2001లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బెంగాల్‌లో ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించారు. నాడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. ఇక 2006, 2011లో 5, 6 విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. 2016, 21లో ఆరు విడతలు నమోదయ్యాయి. శాంతి, భద్రతా పరిస్థితుల ఆధారంగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈసారి తగ్గింపు బీజేపీ ఒత్తిడి కారణమని తృణమూల్‌ ఆరోపిస్తోంది.

Also Read: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : సర్వేలో సంచలన రిజల్ట్స్‌! కింగ్ మేకర్ గా తళపతి

పటిష్ట భద్రత..
గత ఎన్నికల్లో టీఎంసీ–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈసారి అల్లర్లను అరికట్టేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టింది. 1.5 లక్షల కేంద్ర బలగాలను బెంగాల్‌కు పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే 50 వేల పోలీసులను మోహరించారు. మరోవైపు ఈసీ కూడా అల్లర్లు జరుగకుండా పోలింగ్‌ బూతులు కాలనీల్లో ఏర్పాటు చేశారు. దొంగా ఓట్లు తొలగింపు ఓటర్ల ధైర్యాన్ని పెంచుతాయి. ఈ చర్యలు నిర్భయ పోలింగ్‌కు దోహదపడతాయి.

సర్వేలు బీజేపీ ఓటు శాతం 41–48%కు పెరిగిందని, టీఎంసీకి స్వల్ప ఆధిక్యమేనని చెబుతున్నాయి. రెండు విడతలు భయాన్ని తచ్చించకుండా ఓట్లు వేయించి, బీజేపీకి మేలు చేస్తాయని విశ్లేషకులు అంచనా. టీఎంసీ బలపడిన ప్రాంతాల్లో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఫలితాలు రాజకీయ భవిష్యత్తును రూపొందిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper