Homeఆంధ్రప్రదేశ్‌AP crude oil exploration districts: ఏపీలో ఆ జిల్లాల్లో క్రూడాయిల్ కోసం 'అన్వేషణ'!

AP crude oil exploration districts: ఏపీలో ఆ జిల్లాల్లో క్రూడాయిల్ కోసం ‘అన్వేషణ’!

AP crude oil exploration districts: ఏపీలో( Andhra Pradesh) క్రూడాయిల్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అందుకే మిషన్ అన్వేషణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో వెతుకులాట ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో ఈ ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రధానంగా సముద్ర తీర జిల్లాల్లో ఈ అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో.. పెట్రోల్ తో పాటు గ్యాస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి […]

AP crude oil exploration districts: ఏపీలో( Andhra Pradesh) క్రూడాయిల్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అందుకే మిషన్ అన్వేషణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో వెతుకులాట ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో ఈ ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రధానంగా సముద్ర తీర జిల్లాల్లో ఈ అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో.. పెట్రోల్ తో పాటు గ్యాస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఎంతటి పెద్ద దేశమైనా గల్ఫ్ దేశాలపై ఆధారపడి రావాల్సి వస్తోంది. అందులో ఇండియా సైతం బాధిత దేశమే. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కేంద్రం కీలక నిర్ణయానికి వచ్చింది.

ఇక్కడ కూడా సహజ వాయు నిక్షేపాలు..
మనదేశంలో కూడా సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. కానీ వాటిని వెలికి తీయలేకపోతున్నాం. ఇప్పుడు యుద్ధం తో పాటు ప్రపంచ దేశాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన నిక్షేపాలు.. మనమే వినియోగించుకునేలా ఫోకస్ పెట్టింది కేంద్రం. మిషన్ అన్వేషణ్ పేరుతో క్రూడాయిల్ నిక్షేపాల వేట ప్రారంభించింది. ఏపీలో కూడా ఈ అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా భోగాపురం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వరకు బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఈ అన్వేషణ కొనసాగిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం వరకు కూడా ఈ నిక్షేపాల అన్వేషణ జరుపుతున్నారు. ఓఎన్జిసి తోపాటు ఆల్ఫా జియో సంస్థ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నాయి. శాటిలైట్ ద్వారా సర్వే చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు.

Also Read: సీఈసీపై అభిశంసన.. జగన్ ను ఏకిపారేస్తున్న షర్మిల!

అనకాపల్లి తీర ప్రాంతంలో సర్వే..
ప్రస్తుతం అనకాపల్లి( Anakapalli) జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం, రాంబిల్లి, మునగపాక మండలాల్లోని పంట భూముల్లో 60 అడుగుల లోతుల్లో డ్రిల్లింగ్ చేస్తున్నారు. మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. నీటి లభ్యత, సహజవాయునిక్షేపాలకు సంబంధించి అవసరమైన మరికొన్ని పరీక్షలు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా సేకరిస్తున్న మట్టిని, శాంపిల్స్ ను డెహ్రాడూన్ కు పంపిస్తున్నారు. ఈ సర్వేలో ఎక్కడైనా సహజవాయు నిక్షేపాలు గుర్తిస్తే.. సమీపంలో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకునేందుకు నిర్ణయించారు. మరో నాలుగు ఏళ్ల పాటు ఈ సర్వే కొనసాగనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper