Homeజాతీయ వార్తలుWest Bengal Election Results: బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిందట.. సీఎం పదవికి మమత రాజీనామా...

West Bengal Election Results: బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిందట.. సీఎం పదవికి మమత రాజీనామా చేయదట

West Bengal Election Results: కిందపడినా నాదే పై చేయి అని వాదించే వాళ్ళతో మాట్లాడలేం. నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని వాళ్ళతో మాట్లాడే సాహసం చేయలేం. మమతా బెనర్జీ కూడా ఇదే టైపు. ఎప్పుడైతే తను కమ్యూనిస్టులను ఢీ కొట్టి అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలో తొక్కింది. తన పార్టీ కార్యకర్తలను గుండాలుగా మార్చింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సార్వభౌమ అధికారాన్ని తాకట్టు పెట్టింది. కనీసం ఎటువంటి ఆధారాలు పరిశీలించకుండా అడ్డగోలుగా బంగ్లాదేశ్ ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు భారత్ అనేది అందరికీ నివాసయోగ్యమైన దేశమని వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్ ప్రజలు ఈ దేశంలో భాగమని నెత్తిలేని మాటలు మాట్లాడింది.

ఆర్థికంగా అవకతకలకు పాల్పడుతున్నారు.. డబ్బును రకరకాల ఖాతాలకు మళ్లిస్తున్నారు అనే అభియోగాలతో ఐ ప్యాక్ బృందం కార్యాలయాలపై కేంద్ర అధికారులు దాడులు చేస్తే నెత్తి నోరు మొత్తుకుంది మమత. చివరికి అధికారులకు అడ్డుగా నిలబడింది. తాను ఒక ముఖ్యమంత్రి అనే సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. అంతేకాదు పరిపాలనలో మేనల్లుడి జోక్యం పెరిగిపోయి.. వ్యవస్థలు మొత్తం నాశనమవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే మహానటి మాదిరిగా నటిస్తోంది. పైగా బెంగాల్ రాష్ట్రంలో లూటీ చేసి గెలిచారట. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట.

లోక్ భవన్ కు వెళ్ళదట.. వెస్ట్ బెంగాల్లో బిజెపి విజయం కోసం ఎన్నికల సంఘం, కేంద్రం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా కుట్ర చేశాయట. లెక్కింపు కేంద్రాలలో ఆమె పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టారట. దేశంలో ఒకే పార్టీ ఉండాలని బిజెపి చూస్తోందట.. ఇలాంటి ఫెడరల్ పోకడలు మమతలో ఉన్నాయి కాబట్టే కదా బెంగాల్ ప్రజలు భవానిపూర్ ప్రాంతంలో ఓడించింది. నువ్వు వద్దు.. నీ పరిపాలన వద్దు.. అంటూ తన్ని తరిమేసింది.

బెంగాల్ రాష్ట్రాన్ని గొప్పగా పాలించానని చెబుతున్న మమత 2021లో ఎందుకు పడిపోయింది.. అప్పుడు బిజెపి ఇబ్బంది పెట్టిందా.. సిఆర్పిఎఫ్ బలగాలు టి ఎం సి కార్యకర్తలను కొట్టాయా.. లేకపోతే రిగ్గింగ్ చేశాయా.. నాడు నందిగ్రామ్ ప్రాంతంలో ఓటమిపాలైంది. తట్టుకోలేక భవాని పూర్ వచ్చింది. అక్కడ కూడా జనాలు కాండ్రించి ఉమ్మడంతో ఓడిపోయింది. ఇప్పటికైనా మమత నేల మీదికి రావాలి. 71 సంవత్సరాల వయసులో తదుపరి శేష జీవితాన్ని హాయిగా గడపాలి. ఇప్పటికే చాలామంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఎవరు పార్టీలో ఉంటారు తెలియని పరిస్థితి. అలాంటప్పుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు మమత చేయాలి. బిజెపికి ఎదురు వెళ్లే వ్యవహారాలకు పాల్పడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. కోడి ఎంత బలిసినా సరే.. చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడ కొట్టకూడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper